ఈమధ్య కాలంలో స్టార్ హీరో అయినా, ప్యాన్ ఇండియా స్టార్ అయినా, మీడియం రేంజ్ హీరో అయినా, చిన్న హీరో అయినా.. హిట్ సినిమా అయినా, ప్లాప్ సినిమా అయినా థియేటర్స్ లో వచ్చిన మూడు నుంచి నాలుగు వారాలకే ఓటీటీ లో దర్శనమిస్తున్నాయి. సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ అటు ఇటుగా మూడు నుంచి నాలుగు వారాల్లోపే ఓటీటీ ల్లో సందడి చేసాయి.
అసలు ఎనిమిది వారాల గడువు అనే కమిట్మెంట్ ని ఎప్పుడో మర్చిపోయారు హీరోలు, నిర్మాతలు. కానీ ఇప్పుడు మాస్ మహారాజ్ రవితేజ మాత్రం ఈ ఎనిమిది వారాల గడువు ని ఫాలో అయ్యారు అనే చెప్పాలి. అదెలా అంటే జనవరి 13 న సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది.
అదే సంక్రాంతి సీజన్ లో వచ్చిన రాజసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, అనగనగ ఒక రాజు, నారి నారి నడుమ మురారిలు నెల తిరగక ముందే ఓటీటీ కి వచ్చేసాయి. వాటితో పాటు విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం ఇప్పటివరకు ఓటీటీ ఊసు లేదు. ఆలస్యానికి ఏవేవో కారణాలు వినిపించాయి.
ఫైనల్ గా సినిమా విడుదలైన ఎనిమిది వారాల గ్యాప్ లో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 లో మార్చ్ 13 నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతుంది. జనవరి 13 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం జీ 5 నుంచి మార్చి 13 న ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుంది. సో ఆ ఎనిమిది వారాల డీల్ ని రవితేజ ఫాలో అయినట్లేగా..




ప్రభాస్ హగ్ చూసి జెలస్ ఫీలయ్యాడట 

Loading..