Advertisementt

పరుగులు పెట్టిస్తున్న కల్కి 2 షూటింగ్

Fri 27th Feb 2026 09:59 AM
kalki 2  పరుగులు పెట్టిస్తున్న కల్కి 2 షూటింగ్
Kalki 2 shooting in full swing పరుగులు పెట్టిస్తున్న కల్కి 2 షూటింగ్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. దానికి సీక్వెల్ ని అనౌన్స్ చేశారు మేకర్స్. కల్కి విడుదలైన రెండేళ్లకు కల్కి 2 ని నాగ్ అశ్విన్ పట్టాలెక్కించారు. ప్రస్తుతం కల్కి 2  అమితాబచ్చన్, ఇంకా విలన్ పాత్రధారి కమల్ హాసన్ లపై నాగ్ అశ్విన్ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

కల్కి 2 షూటింగ్ చాలా స్పీడు గా జరుగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్, కోలీవుడ్ స్టార్ హీరో కమల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే కాల్ షీట్ టైమ్ అని మాది కట్టుకుని కూర్చోకుండా అవసరం అయితే రాత్రి 9 గంటల వరకు కూడా అమితాబ్-కమల్ కల్కి 2 షూట్ చేస్తున్నారు అని తెలుస్తుంది

నిజంగా ఈ వయసులో కూడా వాళ్ళ డెడికేషన్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అంటూ చిత్ర బృందం చెబుతున్న మాట. అయితే ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ అలాగే  ఫౌజీ షూట్ లో ఉన్నారు. ఇంకా కల్కి 2 సెట్ లోకి ప్రభాస్ ఎంటర్ అవ్వలేదు.. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ వచ్చే నెల 12 వరకు జరుగుతుంది అని సమాచారం. 

Kalki 2 shooting in full swing:

Kalki 2 shooting update

Tags:   KALKI 2
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ