విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఉదయ్ పూర్ లో జరిగిన గ్రాండ్ వెడ్డంగ్ తో విరోష్ ఓ ఇంటివారయ్యారు. తాజా సమాచారం మేరకు అమిత్ షాను హైదరాబాద్ లో మార్చి 4న జరగనున్న విందుకు ఆహ్వానిస్తున్న విరోష్ ఫోటోగ్రాఫ్ నెట్టింట చర్చగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే...విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను వ్యక్తిగతంగా కలిసి తమ వివాహ రిసెప్షన్ (విందు)కు ఆహ్వానించారని వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ అందమైన జంట అమిత్ షాకు వెండి గణేశుడి విగ్రహాన్ని బహూకరించారట. #విరోష్ పేరుతో అభిమానులు ఈ ఫోటోను వైరల్ చేస్తున్నారు.
అయితే ఫోటోల వెనుక నిజం ఏమిటో ఇంకా స్పష్ఠత లేదు. ఇది కేవలం డిజిటల్ మాయాజాలం అని కొందరు కొట్టి పారేస్తున్నారు. గతంలో విజయ్ దేవరకొండ అమిత్ షాను కలిసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా లైగర్ సినిమా సమయంలో. అలాగే రష్మిక కూడా ఢిల్లీలో పలువురు రాజకీయ ప్రముఖులను కలిశారు. పాత ఫోటోలను ఇప్పుడు పెళ్లి వార్తలతో కలిపి ప్రచారం చేసే అవకాశం ఉంది. అమిత్ షాకు ఆహ్వానం ప్రస్తుతానికి గాసిప్ మాత్రమే.




యష్ టాక్సిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ 

Loading..