హీరో విజయ్ దేవరకొండ-హీరోయిన్ రష్మిక మందన్న లు ఈరోజు ఫిబ్రవరి 26 న రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో పెళ్లి పందిరిలో ఏడడుగులు నడిచి ఓ ఇంటివారయ్యారు. ఈరోజు గురువారం ఉదయం 10.30 గంటలకు తెలుగు సాంప్రదాయంలో విజయ్ దేవరకొండ రష్మిక మెడలో తాళి కట్టారు.
విజయ్ దేవరకొండ తన పెళ్లి ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. రష్మిక పెళ్లి కూతురుగా మెరిసిపోగా.. విజయ్ దేవరకొండ తమ ఫ్యామిలీ సాంప్రదాయం ప్రకారం వస్త్రాలు ధరించగా.. రష్మిక చీర కట్టులో చాలా ముద్దుగా కనిపించింది. పెళ్లి లో విజయ్ దేవరకొండ బిందె లో ఉంగరాలు వేసి ఆడిన ఫొటోస్, అలాగే విజయ్ కి రష్మిక ముద్దు పెడుతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండ-రష్మిక ఇదే రోజు సాయంత్రం రష్మిక తమ ఊరి కడువా సాంప్రదాయం లో మరోమారు వివాహం చేసుకున్నారు. ఈ నూతన వధూవరులకు ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.




అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎందుకీ వింత 

Loading..