హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన మచ్ ఎవైటెడ్ నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ తో మరోసారి అందరిలో ఆసక్తిని పెంచారు. వరుసగా తొమ్మిది బాక్సాఫీస్ విజయాలతో అదరగొట్టిన అనిల్ రావిపూడి.. ఈ సంక్రాంతికి వచ్చిన మన శంకరవరప్రసాద్ గారుతో ఆల్ టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్ అందిస్తూ బిగ్గెస్ట్ సక్సెస్ ని నమోదు చేశారు. ఇప్పుడు ఆయన కొత్త ప్రాజెక్ట్‌లో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా నటించనున్నారు.
F2, F3, సంక్రాంతికి వస్తున్నం వంటి బ్లాక్‌బస్టర్ ఎంటర్‌టైనర్‌ల తర్వాత ఇది అనిల్ రావిపూడి వెంకటేష్‌తో కలిసి చేస్తున్న ఐదవ చిత్రం కావడం విశేషం. ఇటివలే MSGలో అతిధి పాత్రలో అదరగొట్టారు వెంకటేష్. అలాగే సంచలనాత్మక బ్లాక్‌బస్టర్ పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్‌తో ఇది అనిల్ రావిపూడి రెండవ చిత్రం.
దర్శకుడు అనిల్ రావిపూడి దగ్గుబాటి, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన స్టార్స్ ని కలిపి ఈ కొత్త చిత్రాన్ని ఒక క్లీన్, టిపికల్ అనిల్ ఎంటర్‌టైనర్‌గా అందరికీ కనెక్ట్ అయ్యే కథాంశంతో రూపొందిస్తున్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే కంప్లీట్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ స్టయిల్, హ్యుమర్, ఎమోషన్స్, ఎంటర్టైమెంట్ తో సంక్రాంతికి ఫెస్టివ్ ట్రీట్‌గా నిలవనుంది.
ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది, ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న భారీ అంచనాలను తగ్గట్టుగా దర్శకుడు స్క్రిప్ట్‌ను జాగ్రత్తగా మెరుగుపరుస్తున్నాడు.
ఈ చిత్రం 2027 సంక్రాంతికి విడుదల కానుంది. అనిల్ రావిపూడి, సంక్రాంతి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. ప్రతి సంవత్సరం పండుగకు ఆయన సినిమాలు ప్రేక్షకులకు గ్రాండ్ ఎంటర్టైన్‌మెంట్ అందిస్తుస్తున్నాయి. సంక్రాంతి వినోదాలకు అనిల్ రావిపూడి చిరునామా అనే భావనను ఇది మరింత బలపరుస్తోంది.




విజయ్ వెడ్స్ రష్మిక - ఫస్ట్ పిక్స్ అవుట్ 

Loading..