Advertisementt

గూస్ బంప్స్ తెప్పిస్తున్న చైతు లైనప్

Wed 25th Feb 2026 10:46 AM
naga chaitanya  గూస్ బంప్స్ తెప్పిస్తున్న చైతు లైనప్
Naga Chaitanya team ramps up hype around his line-up గూస్ బంప్స్ తెప్పిస్తున్న చైతు లైనప్
Advertisement
Ads by CJ

యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య `వృశ‌క‌ర్మ` షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కార్తీక్ దండు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మిస్టిక్ థ్రిల్ల‌ర్ పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. గుహ నేప‌థ్యంలో సాగే ఈ క‌థ‌లో చై సాహ‌స‌కుడి పాత్ర‌లో మెప్పించ‌నున్నాడు. ఈ పాత్ర కోసం ప్ర‌త్యేకంగా స‌న్న‌ద‌మై బ‌రిలోకి దిగాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా అన్ఇన ప‌నులు పూర్తి చేసుకుని ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సినిమా అనంత‌రం చైత‌న్య లైన‌ప్ స్ట్రాంగ్ గా క‌నిపిస్తోంది. చైత‌న్య 25వ సినిమా కోసం చాలా మంది ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నించినా?  చివ‌రిగా ఆ ఛాన్స్ `బెదురులంక` ఫేం క్లాక్స్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ కావ‌డంతో చైత‌న్య ముందుకెళ్తున్నాడు. అలాగే పాన్ ఇండియా డైరెక్ట‌ర్ చందు మొండేటితో కూడా ఓ క‌మిట్ మెంట్ ఉంది.

పాన్ ఇండియాలో ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. అలాగే  విరాజ్ కె. కామ‌త్ అనే కొత్త కుర్రాడితోనూ చై ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. విరాజ్ గతంలో కొన్ని ఆసక్తికరమైన షార్ట్ ఫిలిమ్స్ , యాడ్స్ ద్వారా గుర్తింపు పొందాడు.

ఇదొక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ అని సమాచారం. అలాగే విక్ర‌మ్. కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో  `దూత`కు  సీక్వెల్

`దూత 2` చేయ‌డానికి  రెడీ అవుతున్నాడు. 2026 ద్వితీయార్ధంలో `దూత 2` పట్టాలెక్కే అవకాశం ఉంది. అలాగే శివ నిర్వాణ తో కూడా చైత‌న్య ఓ సినిమా చేయాల్సి ఉంది. స్టోరీ లాక్ అయింది. కానీ చైత‌న్య బిజీ షెడ్యూల్ కార‌ణంగా డిలే అవుతోంది.   

Naga Chaitanya team ramps up hype around his line-up:

Naga Chaitanya

Tags:   NAGA CHAITANYA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ