Advertisementt

ఈషారెబ్బా బోజ్ పురీకి వెళ్తోందా

Wed 25th Feb 2026 09:53 AM
eesha rebba  ఈషారెబ్బా బోజ్ పురీకి వెళ్తోందా
Eesha Rebba ఈషారెబ్బా బోజ్ పురీకి వెళ్తోందా
Advertisement
Ads by CJ

సినిమాల్లో న‌టించాలంటే? అయితే సౌత్ ఇండ‌స్ట్రీ లేదా?  బాలీవుడ్ ఇండ‌స్ట్రీ. ఈ రెండు త‌ప్పితే!  మిగ‌తా సినీ ప‌రిశ్ర‌మ‌ల గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. ఒడియా, బోజ్ పురీ , మ‌రాఠీ, గుజ‌రాతీ ఇలా మరికొన్ని ప్రాంతీయ ప‌రిశ్ర‌మ‌లు ఉన్నాయి. వీటిలో స్థానిక న‌టీన‌టులు త‌ప్ప ప్ర‌ధాన ప‌రిశ్ర‌మ‌ల నుంచి పెద్ద‌గా ఎవ్వ‌రూ వెళ్ల‌రు. అక్క‌డ ప‌ని చేసిన న‌టీన‌టులే ప్ర‌ధాన ప‌రిశ్ర‌మ‌ల వైపు రావ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు.

న‌టించిన అనుభ‌వం ఉన్నా?  ఇక్క‌డ వారిని కొత్త వారిగానే ప‌రిగ‌ణిస్తుంటారు. అంత సుల‌భంగా అవ‌కాశాలు రావు. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే తాజాగా తెలుగు న‌టి ఈషారెబ్బా బోజ్ పురిలో న‌టించ‌డానికి రెడీ అవుతుంద‌ని వార్త లొస్తు న్నాయి. ఇటీవ‌లే ఓ బోజ్ పురీ ఏజెన్సీ అమ్మ‌డిని సంప్ర‌దించ‌గా మంచి పారితోషికం ఆఫ‌ర్ చేస్తే న‌టించ‌డానికి తాను సిద్దంగానే ఉంటాన‌ని చెప్పిందిట‌. ఇదే నిజ‌మైతే?  టాలీవుడ్ నుంచి మ‌రో న‌టి బోజ్ పురీ ప‌రిశ్ర‌మ‌కు వెళ్తున్న‌ట్లే.

ఇప్ప‌టికే భోజ్పురి ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేసిన కొంత మంది తెలుగు న‌టులు ఉన్నారు.   90ల నాటి టాప్ హీరోయిన్లు కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు అక్కడ మంచి కూడా విజయం సాధించారు.సీనియ‌ర్ న‌టి రంభ భోజ్‌పురి చిత్రాల్లో నటించారు. రవి కిషన్ వంటి స్టార్ హీరోల సరసన ఆమె పలు చిత్రాల్లో కనిపించారు.

అలాగే  తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా మెప్పించిన రమ్య శ్రీ కూడా  భోజ్‌పురిలో హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసారు. కీలక పాత్రల్లో అనేక సినిమాల్లో నటించి అక్కడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా మధు శర్మ  తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, భోజ్‌పురిలో మాత్రం స్టార్ హీరోయిన్‌గా స్థిరపడ్డారు. అక్కడ ఆమె ఎన్నో హిట్లు అందుకున్నారు.

Eesha Rebba:

Actress Eesha Rebba

Tags:   EESHA REBBA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ