Advertisementt

ఆరా ఆఫ్ ఉస్తాద్.. ప‌వ‌న్ మానియా స్టార్ట్

Sun 22nd Feb 2026 08:41 PM
ustaad bhagat singh  ఆరా ఆఫ్ ఉస్తాద్.. ప‌వ‌న్ మానియా స్టార్ట్
Aura Of Ustaad from Ustaad Bhagat Singh ఆరా ఆఫ్ ఉస్తాద్.. ప‌వ‌న్ మానియా స్టార్ట్
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న `ఉస్తాద్ భగత్ సింగ్` సినిమా నుండి విడుదలైన ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ పాట పవన్ కల్యాణ్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ పాట లాంచింగ్ ఈవెంట్ హైద‌రాబాద్ మ‌ల్లారెడ్డి విశ్వ‌విద్యాల‌యంలో విద్యార్థుల సమ‌క్షంలో వైభ‌వంగా సాగుతోంది.  

ఈ పాటలో పవన్ కల్యాణ్ తన వింటేజ్ మాస్ లుక్, స్వాగ్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా మార్కెట్ యార్డ్‌లో గ్లాస్ పట్టుకుని నడిచి వచ్చే సీన్లు గబ్బర్ సింగ్ రోజులను గుర్తు చేసాయి. ఆస్కార్ విన్నింగ్ సాంగ్ రైట‌ర్ చంద్రబోస్  అందించిన లిరిక్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. మెడ ముట్టుకుంటే.. తొడ కొట్టినట్టే! అనే పంచ్ డైలాగ్ ని ఈ లిరిక్ తో జోడించి మ్యాజిక్ చేసారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన అదిరిపోయే బీట్స్ యూత్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇది కేవలం ఒక పాటలా కాకుండా.. పవన్ కల్యాణ్ కెరీర్‌లో మరో భారీ ఇంట్రడక్షన్ యాంథమ్‌లా నిలిచిపోనుంది.

ఈ చిత్రం మార్చి 26న‌ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్‌ను ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపిస్తున్నారు. రెండున్నర గంటల సినిమాలో పవన్ కల్యాణ్ దాదాపు 2 గంటల పాటు స్క్రీన్ మీద ఉంటారని హరీష్ శంకర్ వెల్లడించడం ఫ్యాన్స్‌కు పెద్ద కిక్ ఇచ్చింది.

ఈరోజు హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన పాట విడుదల వేడుకలో వేల సంఖ్యలో విద్యార్థులు  అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్, ఆయన బాడీ లాంగ్వేజ్ అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో ఈ సినిమాలో అలాగే ఉండబోతుందని తెలిపారు.

Aura Of Ustaad from Ustaad Bhagat Singh:

 Ustaad Bhagat Singh

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ