ప్రభాస్ లైనప్ నుంచి దర్శకుడు ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడు, ప్రభాస్-ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయింది.. ప్రభాస్ లైనప్ లో ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, సలార్ 2 మాత్రమే ఉన్నాయి అంటూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. ప్రశాంత్ వర్మ .. ఈ నెల 22 న రిషబ్ శెట్టి తో జై హనుమాన్ పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నారు.
ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ షూటింగ్స్ తో బిజీగా ఉండడమే కాదు త్వరలోనే కల్కి 2 సెట్ లోకి వెళ్ళబోతున్నారు. అంతలోనే ప్రభాస్ - ప్రశాంత్ వర్మ మూవీ అటకెక్కలేదు, ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పూర్తి చేసేలోపు, ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ అలాగే కల్కి 2 షూటింగ్స్ పూర్తి చేసుకుని వస్తారు.. ఖచ్చితంగా ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమా ఉంటుంది అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది.
మరి ప్రభాస్ ఇప్పుడు మూడు సినిమాలను సెట్ పైకి తీసుకెళుతున్నారు. ఆతర్వాత సలార్ 2, ప్రశాంత్ వర్మ సినిమాలు ఒకేసారి చేస్తారేమో చూడాలి.




సిద్దిపేట నుంచే పోటీ అంటున్న కవిత 
Loading..