Advertisementt

సిద్దిపేట నుంచే పోటీ అంటున్న కవిత

Thu 19th Feb 2026 03:15 PM
kavitha  సిద్దిపేట నుంచే పోటీ అంటున్న కవిత
Kavitha to launch Telangana party in May సిద్దిపేట నుంచే పోటీ అంటున్న కవిత
Advertisement
Ads by CJ

తెలంగాణ రాజకీయాల్లో అనేకన్నా కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టింది. కేసీఆర్ ఇంట్లో మొదలై అది పార్టీ లో పెరిగి పెద్దదయ్యింది. తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ హరీష్ రావు లపై సమర శంఖం పూరించిన కవిత కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యింది. తండ్రి కేసీఆర్ ని ఎదిరించడమే కాదు అన్న కేటీఆర్, హరీష్ రావు లపై ఇంతెత్తున లేస్తుంది. జాగృతి పేరు మీద కార్యకలాపాలు సాగిస్తున్న కవిత మే మొదటి వారంలో పార్టీ ప్రకటిస్తాం అని ఓ చిట్ చాట్ లో చెప్పుకొచ్చింది. 

మే మొదటి వారంలో మంచి ముహూర్తం చూసుకొని పార్టీ ఏర్పాటు చేస్తాం, పార్టీ పేరులో తెలంగాణ ఉంటుంది, ఎన్నికల్లో నేను ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు, కానీ మా మొదటి ఛాయిస్ సిద్దిపేట, రెండో చాయిస్ బోధన్. అంటే బావ హరిష్ రావు పై కవిత పోటీకి సై అంటుంది. తెలంగాణ లో మేమే ప్రధాన ప్రతి పక్షం. ఇకపై తెలంగాణలో బీజేపీ ఉండదు. రాబోయే రోజుల్లో జాగృతి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి, అధికారంలోకి వస్తుంది.

మేము పక్కా అధికారంలోకి వస్తాం. తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షంగా జాగృతి ఉంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు చాల మంది నాతో టచ్ లో ఉన్నారు. ఎవరు టచ్ లో ఉన్నారో సందర్భం ఉన్నప్పుడు చెబుతా.. అంటూ కవిత తన కొత్త పార్టీ ప్రారంభించబోయేది ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది. 

Kavitha to launch Telangana party in May:

Kavitha

Tags:   KAVITHA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ