Advertisementt

ప్రత్యూష కి న్యాయం జరిగిందా

Tue 17th Feb 2026 04:16 PM
pratyusha  ప్రత్యూష కి న్యాయం జరిగిందా
Actress Pratyusha ప్రత్యూష కి న్యాయం జరిగిందా
Advertisement
Ads by CJ

నటి ప్రత్యూష కేసులో ఆమెకు న్యాయం జరిగిందా, సిద్దార్థ్ రెడ్డి కి రెండేళ్ల  జైలు శిక్ష, 50 వేల జరిమానా సరిపోతుందా. ఓ అమ్మాయిని మానసికంగా బాధపెట్టి ఆత్మహత్యకు పురిగొల్పిన వ్యక్తికీ ఇలాంటి శిక్ష సరిపోతుందా.. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో పలువురు మధ్యలో నడుస్తున్న చర్చ. 

ప్రత్యూష మరణం తర్వాత ఈ కేసుని 23ఏళ్ళు విచారణ నడిపి.. ముద్దాయి సిద్దార్థ్ రెడ్డి కి రెండేళ్లు శిక్ష వేసిన న్యాయ వ్యవస్థ కు జనాలు సెల్యూట్ చేస్తున్నారు. సిద్దార్థ్ రెడ్డి కి రెండేళ్లు శిక్ష విధించి సింపుల్ గా వదిలేసినందుకు వెటకారంగా ట్వీట్లు వేస్తున్నారు. కేవలం రెండేళ్ల జైలు శిక్ష వేసిన న్యాయస్తానాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు.

గతంలో హై కోర్టు విధించిన శిక్షను సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఈకేసులో సిద్దార్థ్ రెడ్డికి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఇంత చిన్న శిక్ష వేస్తె ప్రత్యూష ఆత్మ శాంతిస్తుందా, ఒక ఆడపిల్లని శారీరకంగా వాడుకొని, చావుకి కారణమైన వాడికి రెండేళ్లు జైలు శిక్ష సరిపోతుందా అంటూ సుప్రీం తీర్పు పై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Actress Pratyusha:

Pratyusha case

Tags:   PRATYUSHA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ