Advertisementt

వారణాసి-తన రోల్ రివీల్ చేసిన ప్రకాష్ రాజ్

Tue 17th Feb 2026 03:34 PM
prakash raj  వారణాసి-తన రోల్ రివీల్ చేసిన ప్రకాష్ రాజ్
Varanasi - Prakash Raj role revealed వారణాసి-తన రోల్ రివీల్ చేసిన ప్రకాష్ రాజ్
Advertisement
Ads by CJ

దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కిస్తున్న వారణాసి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ని కంప్లీట్ చేసిన టీమ్ ఇప్పుడు జార్జియా కి వెళ్లబోతుంది. అక్కడ అరుదైన లొకేషన్స్ లో సూపర్ స్టార్ మహేష్ ఇంకా ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ లపై కీలక సన్నివేశాల చిత్రీకరణను రాజమౌళి చేపట్టబోతున్నారు.

అయితే కొద్దిరోజులుగా నటుడు ప్రకాష్ రాజ్ మహేష్ బాబు కి తండ్రిగా నటిస్తాడని ప్రచారం ఉండగా.. ప్రకాష్ రాజ్ వారణాసిలో నటిస్తున్నటుగా కన్ ఫర్మ్ చెయ్యడమే కాదు.. తాజాగా ఆయన వారణాసిలో తన పాత్ర ఎలా ఉండబోతుందో అనేది ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. వారణాసి చిత్రంలో తానొక మహా శివ భక్తుడి పాత్ర పోషిస్తున్నానని తెలిపారు. 

గతంలో వారణాసి చిత్రానికి సంబందించిన అద్భుతమైన షెడ్యూల్‌ ముగిసిందని, ఆ పాత్ర తనలో నటుడి ఆకలిని తీర్చిందని, రాజమౌళి, మహేష్, పృథ్వీరాజ్‌, ప్రియాంక చోప్రాలకు థ్యాంక్స్‌. మీతో పనిచేయడం ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది.. అని చెప్పిన ప్రకాష్ రాజ్ తాజాగా వారణాసి లో తన రోల్ ని కూడా రివీల్ చేసి కిక్ ఇచ్చారు.

Varanasi - Prakash Raj role revealed:

Prakash Raj role in Varanasi revealed

Tags:   PRAKASH RAJ
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ