Advertisementt

ఫైనల్లీ VD - రష్మిక వెడ్డింగ్ కార్డు రివీల్డ్

Mon 16th Feb 2026 04:17 PM
vijay devarakonda  ఫైనల్లీ VD - రష్మిక వెడ్డింగ్ కార్డు రివీల్డ్
Vijay Devarakonda-Rashmika wedding card viral ఫైనల్లీ VD - రష్మిక వెడ్డింగ్ కార్డు రివీల్డ్
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న లు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ పెళ్లి ఫిబ్రవరి 26 న రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో గ్రాండ్ గా జరగబోతుంది, మార్చ్ 4 న హైదరాబాద్ లో రిసెప్షన్ అంటూ ప్రచారం జరగడమే కాదు అటు విజయ్ దేవరకొండ కానీ, ఇటు రష్మిక కానీ పెళ్లి విషయమై పెదవి విప్పడం లేదు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసాడు.

విజయ్ దేవరకొండ తన వెడ్డింగ్ రిసెప్షన్ కి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు అన్నారు. మరోపక్క విజయ్ దేవరకొండ, రష్మిక లు తమ సన్నిహితులకు పెళ్లి పత్రికలూ పంచుతున్నారు అన్నా ఏది అఫీషియల్ గా తెలియడం లేదు. ఇప్పుడు ఫైనల్ గా ఈ సస్పెన్స్ కి తెర పడింది. 

విజయ్ దేవరకొండ - రష్మిక ల పెళ్లి కార్డు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అది చూసి హమ్మయ్య ఈ కార్డు అయినా రివీల్ అయ్యింది అంటూ వారి వారి అభిమానులు సర్ ప్రైజ్ అవుతున్నారు. పెళ్లి ఫిబ్రవరి 26 న, వెడ్డింగ్ రిసెప్షన్ మర్చి 4 హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ లో అంటూ ఆ కార్డు లో ప్రింట్ చేసారు. 

ప్రస్తుతం ఉదయపూర్ ప్యాలెస్ లో విజయ్ దేవరకొండ-రష్మిక ల పెళ్లి పనులు జోరుగా మొదలైపోయాయి. ఈ పెళ్ళి కుటుంబ సభ్యులు,  సన్నిహితుల నడుమ సింపుల్ గా జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. రష్మిక-VD వివాహానికి కేవలం 10 రోజులే సమయముంది మరి.

Vijay Devarakonda-Rashmika wedding card viral:

Vijay Devarakonda-Rashmika wedding card viral on social media

Tags:   VIJAY DEVARAKONDA
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ