సెన్సార్ బోర్డు కి ఏదో ఒక తిక్క ఉంటుందేమో, లేదంటే కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ కి A సర్టిఫికెట్ ఇవ్వడమేమిటో అంటూ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అంటున్న మాట. హిట్ అయిన సినిమాకి కేవలం A సర్టిఫికెట్ ని సెన్సార్ వారు ఇవ్వడం వల్లే రెవిన్యూ తగ్గింది అని నిర్మాత తెగ మొత్తుకున్నాడు.
ఇప్పుడు హే భగవాన్ టైటిల్ మార్చమని సెన్సార్ బోర్డు మేకర్స్ కి ఆదేశాలు జారీ చేసింది. టైటిల్ మార్చకపోతే సెన్సార్ సర్టిఫికెట్ రాదు. ఇప్పటికే హే భగవాన్ మేకర్స్ సినిమాని హే భగవాన్ టైటిల్ పై ప్రోపర్ గా ప్రమోట్ చేసి ప్రేక్షకుల్లోకి పంపించారు. చివరి నిమిషంలో టైటిల్ మార్చడమంటే అది మళ్లీ ప్రేక్షకులకు రీచ్ అవుతుందా..
అసలు హే భగవాన్ అనే టైటిల్ లో ఏం తప్పు ఉంది, ఆ టైటిల్ మార్చమనడం ఏంటి, కేవలం తెలుగు సినిమాల విషయంలోనే ఇలా జరుగుతుందా, లేదంటే ఇతర భాషల సినిమాల విషయంలోనూ సెన్సార్ ఇలానే చేస్తుందా అంటూ సదరు ప్రేక్షకులు మండిపడుతున్నారు.
ఇక సెన్సార్ బోర్డు వల్ల సుహాస్ నటించిన హే భగవాన్ టైటిల్ ని హే బలవంత్ గా చేంజ్ చేసారు మేకర్స్.




నిశ్చితార్థాన్ని దాచి మోసం చేసిన హీరో

Loading..