Advertisementt

దృశ్యం 3 క్లైమాక్స్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే

Mon 09th Feb 2026 01:38 PM
drishyam 3  దృశ్యం 3 క్లైమాక్స్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే
Edge-Of-The-Seat Film - Drishyam 3 Climax దృశ్యం 3 క్లైమాక్స్ చూస్తే స్టన్ అవ్వాల్సిందే
Advertisement
Ads by CJ

మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం సీరీస్ ఎంత పెద్ద హిట్టో తెలిసిన విషయమే. దృశ్యం 1, దృశ్యం 2 చిత్రాలు వేటికవే ప్రత్యేకమైనవి. ఊహలకందని ట్విస్ట్ లతో జీతూ జోసెఫ్ మోహన్ లాల్ కేరెక్టర్ ని నడిపించితిన తీరుకు ప్రేక్షకులు కాదు కాదు పాన్ ఇండియా ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు.

ఇప్పుడు జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న దృశ్యం 3 చిత్రం ఏప్రిల్ లో విడుదల కాబోతుంది. అయితే దృశ్యం పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాల్లో ఉన్న ట్విస్ట్ లు దృశ్యం 3 లో ఊహించుకోకండి, దృశ్యం 3 కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది అని జీతూ జోసెఫ్ చెప్పేసారు. కాకపోతే దృశ్యం 3 క్లైమాక్స్ పై ఈ చిత్ర నటి ఆశా శరత్ తాజాగా పెంచిన అంచనాలు మాత్రం వేరే లెవల్.

దృశ్యం 3 క్లైమాక్స్ చూసి స్టన్ అయిపోతారు. అసలీలు ఇది నిజమేనా అని షాకైపోతారు. ఆడియన్స్ కుర్చీ అంచున కూర్చోబెట్టే సినిమా ఇది అంటూ ఆశా శరత్ దృశ్యం 3 క్లైమాక్స్ పై అంచనాలు పెంచేశారు. మరి ఏప్రిల్ 2 న దృశ్యం 3 కక్లైమాక్స్ కోసమైనా థియేటర్స్ కి వెళ్లాల్సిందే. 

Edge-Of-The-Seat Film - Drishyam 3 Climax:

Drishyam 3-Asha Sarath says ending will stun the viewers

Tags:   DRISHYAM 3
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ