Advertisementt

థియేటర్ కే కాదు ఓటీటీ కి అదే ప్రమోషన్

Mon 09th Feb 2026 01:10 PM
mana shankara vara prasad garu  థియేటర్ కే కాదు ఓటీటీ కి అదే ప్రమోషన్
MSG OTT promotions థియేటర్ కే కాదు ఓటీటీ కి అదే ప్రమోషన్
Advertisement
Ads by CJ

అనిల్ రావిపూడి తెరకెక్కించే సినిమాల ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరూ చూస్తున్నారు. సినిమా గురించి ఎంతగా మాట్లాడుకుంటారో, అనిల్ రావిపూడి చేసే ప్రమోషన్స్ గురించి కూడా అంతే మాట్లాడుకుంటారు. ఏం మాయ చేసాడో.. ఎంత పే చేసినా ప్రమోషన్స్ కి రాని నయనతార మన శంకర వరప్రసాద్ గారు ప్రమోషన్స్ లో కనిపించింది.

మన శంకర వరప్రసాద్ గారు ప్రమోషన్స్ ని అనిల్ రావిపూడి ఎంతెలా చేసాడో, థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చాక కూడా అనిల్ రావిపూడి థియేటర్స్ టూర్ అంటూ తెగ హడావిడి చేసాడు, సినిమా విడుదలకు ముందు థియేటర్స్ ప్రమోషన్స్ ని ఎలా అయితే చేసారో.. మన శంకరవరప్రసాద్ గారి ఓటీటీ ప్రమోషన్స్ అలానే ఉన్నాయి.

జీ 5 ఓటీటీ నుంచి ఈ నెల 11 నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతున్న మన శంకర వరప్రసాద్ గారు ప్రమోషన్స్ జీ తెలుగు, జీ సినిమాల్లో తెగ ప్రమోట్ చేస్తున్నారు, వేరే యాడ్స్ ఏమి లేకుండా కేవలం శంకర వరప్రసాద్ గారు ఓటీటీ స్ట్రీమింగ్ యాడ్స్ మాత్రమే కనిపించడం చూసి మన శంకర వరప్రసాద్ గారు కి థియేటర్ కే కాదు ఓటీటీ కి అదే ప్రమోషన్ అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

MSG OTT promotions:

Mana Shankara Vara Prasad Garu OTT promotions

Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ