Advertisementt

సమస్యల సుడిగుండంలో హీరో విజయ్

Fri 06th Feb 2026 04:43 PM
vijay  సమస్యల సుడిగుండంలో హీరో విజయ్
Hero Vijay సమస్యల సుడిగుండంలో హీరో విజయ్
Advertisement
Ads by CJ

 

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవడమేమో కానీ.. ఆయన్ని సమస్యలు సుడిగుండంలా పట్టి పీడిస్తున్నాయి. గత ఏడాది జరిగిన కరూర్ తొక్కిసలాట, మరోపక్క ఈ ఏడాది జన నాయకన్ విడుదల కాకుండా సెన్సార్ సమస్యలు, మరోపక్క ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ. 1.5 కోట్ల జరిమానా విషయలో విజయ్ ఆ కేసును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం కొట్టివేసింది.

2015-16 అసెస్‌మెంట్ కాలానికి సంబంధించి తన అసలు ఆదాయాన్ని వెల్లడించలేదన్న కారణంతో విజయ్ కు ఐటి శాఖ పెనాల్టీ వేసింది. దానిని సవాల్ చేసిన విజయ్ కి కోర్టు షాకిచ్చింది. ఆ కోటిన్నర విజయ్ జరిమానా రూపంలో కట్టాల్సి ఉంది.

మరి రాజకీయాలేమో కానీ.. విజయ్ ని ప్రశాంతంగా పాలిటిక్స్ చేసుకోకుండా చేస్తున్నారు. ఏదో విధంగా బీజేపీ ప్రభుత్వం ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసి లాక్ చెయ్యాలనే ఉద్దేశ్యంతోనే కనిపిస్తుంది. 

Hero Vijay:

Kollywood Hero Vijay

Tags:   VIJAY
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ