Advertisementt

సుమతీ శతకం రివ్యూ

Fri 06th Feb 2026 05:31 PM
sumathi satakam  సుమతీ శతకం రివ్యూ
Sumathi Satakam Movie Review సుమతీ శతకం రివ్యూ
Advertisement
Ads by CJ

నటీనటులు: అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి, టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్ తదితరులు

సినిమాటోగ్రాఫర్: ఎస్ హలేష్

సంగీతం: సుభాష్ ఆనంద్

ఎడిటర్: నహిద్ మహమ్మద్బ్యానర్: విజన్ మూవీ మేకర్స్నిర్మాత: సాయి సుధాకర్ కొమ్మాలపాటి

రచన, దర్శకత్వం: ఎంఎం నాయుడు

బుల్లితెరపై తనకంటూ తిరుగులేని స్టార్‌డమ్ సొంతం చేసుకు స్టార్ మా బిగ్ బాస్ రియాలిటీ షో తో ప్రేక్షకులను, అభిమానులను సంపాదించుకున్న కుర్రాడు అమర్ దీప్ చౌదరి. నటుడిగా మారాలనే పిచ్చి, మాస్ మహారాజా రవితేజ స్ఫూర్తితో ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఎదిగిన యంగ్‌స్టర్. బుల్లితెర నుంచి ఇప్పుడు వెండితెరపైకి హీరోగా అడుగు పెట్టాడు అమర్ దీప్. హీరోగా కొన్ని విజయాలు అందుకున్నాడు. ఆయన నటించిన తాజా సినిమా సుమతీ శతకం. ప్రేమికుల దినోత్సవానికి వారం ముందు వచ్చిన ఈ సినిమా రిజల్ట్ ఏంటో, ఈ సినిమా అమర్ దీప్ చౌదరి ఆశించిన విజయం అందిస్తుందో లేదో సమీక్షలో చూద్దాం. 

సుమతీ శతకం- స్టోరీ:

తూర్పు గోదావరి జిల్లాలోని వైకుంఠపురం గ్రామంలో కిరాణా కొట్టు నడిపే కుర్రాడు కృష్ణ (అమర్ దీప్ చౌదరి). చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే పిచ్చి. జాతర రోజున ఊరి గుడిలో పెళ్లి చేసుకుంటానని నాయనమ్మకు మాట ఇస్తాడు. దేవుడికి ఎన్ని మొక్కులు మొక్కుకున్నా పిల్ల మాత్రం దొరకదు. పొరుగూరిలో అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అంగన్ వాడీ టీచర్ సుమతి (శైలి చౌదరి)ని చూస్తాడు. ఆమె వెంట పడతాడు. కృష్ణను సుమతి ప్రేమించిందా లేదా, సుమతితో కృష్ణ పెళ్లికి వచ్చిన సమస్యలు ఏమిటి, వాటిని కృష్ణ ఎలా ఫేస్ చేశాడు అనేది సుమతీ శతకం కథ. 

సుమతీ శతకం స్క్రీన్ ప్లే:

గ్రామీణ నేపథ్యంలో సాగిన ఈ సినిమాకు ఇంటర్వెల్ ముందు ఇచ్చిన ట్విస్ట్, అదే విధంగా పతాక సన్నివేశాల్లో చూపించిన సన్నివేశాలు సుమతీ శతకం చిత్రానికి మెయిన్ ప్లస్ పాయింట్. పల్లెటూరి నేపథ్యంలో మామూలు ప్రేమకథగా మొదలైన ఈ సినిమాకు ఇంటర్వెల్, క్లైమాక్స్ మైథాలజీ టచ్ ఇచ్చాయి. ప్రథమార్ధమంతా వినోదంతో నింపేసిన దర్శకుడు, ద్వితీయార్థంలో ప్రేమలో పరీక్షలు పెట్టాడు. పల్లె వాతావరణం నేపథ్యంలో మాస్ కామెడీ చూపించి... తర్వాత నిదానంగా భావోద్వేగ భరితంగా పతాక సన్నివేశాలకు తీసుకు వెళ్లిన తీరు బావుంది. దాంతో కమర్షియల్ పంథాలో చక్కటి సినిమా చూసిన అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుంది.

సుమతీ శతకం పేరెఫార్మెన్స్ :

టీవీలో చూసిన అమర్ దీప్ చౌదరి వేరు... సుమతీ శతకంలో చూసిన అమర్ దీప్ చౌదరి వేరు అనేంతగా ఆయన నటన సాగింది. తనకు వచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకున్నారు. కిరాణా కొట్టు కృష్ణగా పల్లెటూరు యువకులను గుర్తు చేశారు. అదే సమయంలో అవకాశం లభించిన ఒకట్రెండు సన్నివేశాల్లో పరిణితి చూపించారు. కథకు, తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. హీరోతో పాటు ఉండే పాత్రలో టేస్టీ తేజ నవ్వించాడు. హీరోయిన్ శైలి చౌదరి సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. ఊరి ప్రెసిడెంట్ పాత్రలో మహేష్ విట్టా కూడా నవ్వించారు. మిగతా ఆర్టిస్టులు తమ పాత్రలకు తగ్గట్టు నటించారు.

సుమతీ శతకం ఎఫర్ట్ :

సుమతీ శతకం టీమ్ లో మొదటగా అభినందించాల్సింది సంగీత దర్శకుడు - ఛాయాగ్రాహకులదే. పాటల్లో పల్లె సందడి వినిపించింది. కమర్షియల్ సినిమాకు అవసరమైన మ్యూజిక్ అందించారు సుభాష్ ఆనంద్. ఎస్ హాలేష్ సినిమాటోగ్రఫీ పల్లె అందాలను చక్కగా ఆవిష్కరించింది. మంచి పాయింట్ తీసుకున్న దర్శక రచయిత ఎంఎం నాయుడు కొంత రొటీన్ ఫార్ములాలో వెళ్లడం మినహా సినిమాను బాగా తీశారు. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా ప్రొడ్యూస్ చేశారు. ఎడిటింగ్ అండ్ ఆర్ట్ విభాగాలు కూడా తమ బాధ్యతను సమర్ధంగా నిర్వర్తించాయి.

సుమతీ శతకం ఎనాలసిస్ :

ఓవరాల్ గా సుమతీ శతకం ఎలా ఉందనే విషయానికి వస్తే... ఫస్టాఫ్ మొత్తం గ్రామీణ వినోదం చక్కగా అందిస్తుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ హీరోకి షాక్ అయితే, ఆడియన్స్‌కు సెకండాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. సెకండాఫ్ లో వినోదం పాళ్ళు తగ్గించి భావోద్వేగాలకు పెద్దపీట వేశారు. పల్లెటూళ్లలో ఉన్న కొన్ని మూఢ నమ్మకాల మీద సందేశాన్ని ఇస్తుంది. పల్లెటూరి నేపథ్యంలో చక్కటి ప్రేమ కథ, అనుబంధాలు - భావోద్వేగాలు ఉన్న సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులను మెప్పించే సినిమా సుమతీ శతకం

పంచ్ లైన్: సున్నితమైన వినోదం, భావోద్వేగంతో మెప్పించే సుమతీ శతకం

సినీజోష్ రేటింగ్: 2.5/5

Sumathi Satakam Movie Review:

Sumathi Satakam Telugu Movie Review

Tags:   SUMATHI SATAKAM
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ