Advertisementt

చంద్రబాబు-లోకేష్ తప్పు చేస్తున్నారా..

Mon 02nd Feb 2026 09:19 AM
lokesh  చంద్రబాబు-లోకేష్ తప్పు చేస్తున్నారా..
Chandrababu - Nara Lokesh చంద్రబాబు-లోకేష్ తప్పు చేస్తున్నారా..
Advertisement
Ads by CJ

సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబు, మినిస్టర్ స్థానంలో ఉన్న నారా లోకేష్ తప్పు చేస్తున్నారా.. అవును నిజమే తమ కార్యకర్తలను అదుపులో పెట్టుకోకుండా వారు రెచ్చిపోతుంటే వీరు మౌనం వహించడం చాలామందికి నచ్చట్లేదు. గత రెండు రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ఏపీ ప్రజలే స్వయంగా మాట్లాడుతున్న మాట చంద్రబాబు, లోకేష్ తప్పుచేస్తున్నారని.

బ్లూ మీడియా చంద్రబాబు, లోకేష్ తప్పుచేస్తున్నారని పాట పాడడం కాదు, చంద్రబాబు, లోకేష్ లు తమ కార్యకర్తలకు నచ్చజెప్పాలి. అంబటి రాంబాబు కారుకూతలు కూశాడు, అతన్ని పనిష్ చెయ్యాలి. కానీ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అంబటి ఇంటిపై పడీ రచ్చ చేసి అంబటి కార్యాలయాన్ని మంటల్లో తగలెట్టడం ఎంతవరకు సమంజసం. అక్కడే చంద్రబాబు, లోకేష్ లు కార్యకర్తలను ఆపి ఉండాలి.

కార్యకర్తలు సంయమనం పాటించాలని ఒక్క ట్వీట్ వెయ్యాల్సింది. అప్పటికే పరిస్థితి చేజారిపోయింది. అంబటి ఇంటిపై పడి రచ్చ చేసి ఆ ఇంట్లో వాళ్ళని భయబ్రాంతులకు గురి చేశారు. మరోపక్క జోగి రమేష్ లోకేష్ ని తిట్టాడు అని ఆయన ఇంటిపై పడి ఇంటిని తగలబెట్టేశారు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు. ఇదంతా ఎందుకు జరుగుతుంది. చంద్రబాబు, లోకేష్ లు ఆపనందుకే.

ఈ విషయంలో కూటమి ప్రభుత్వానికి మచ్చ ఏర్పడుతుంది. ఇలాంటి పనులు చేస్తే ప్రజల సహనము సచ్చిపోతుంది. వారు తిట్టారని ఇళ్లను ధ్వంశం చేసి, కార్ల ను పగలగొట్టి, టమాటాలు విసిరితే కోపం పోతుంది కానీ.. అది చంద్రబాబు, లోకేష్ లకు మాయని మచ్చగా మిగులుతుంది. అందుకే అభిమానులను, కార్యకర్తలను కంట్రోల్ చెయ్యాలి.

బాబు గారు కానీ, లోకేష్ కానీ ఒక్క మాట చెబితే చాలు వారు సైలెంట్ అవుతారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనుకోవాలి కానీ, దాడులు చేస్తే ఉపయోగం కన్నా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. ఇక్కడ అదే కనిపిస్తుంది. 

Chandrababu - Nara Lokesh:

CM Chandrababu - Minister Nara Lokesh

Tags:   LOKESH
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ