Advertisementt

స్టార్ హీరో ఆవేద‌న‌

Mon 02nd Feb 2026 08:58 AM
shahid kapoor  స్టార్ హీరో ఆవేద‌న‌
Shahid Kapoor says business-first mindset is damaging Hindi cinema స్టార్ హీరో ఆవేద‌న‌
Advertisement
Ads by CJ

కేవలం బిజినెస్ లెక్కల చుట్టూ తిరిగే ఆలోచనా విధానం వల్ల సినిమాల్లో `కళాత్మక స్వేచ్ఛ` క్రమంగా నశించిపోతోందని ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేక్షకులు ఇప్పుడు థియేటర్లలో భారీ మాస్` ఎంట‌ర్ టైన‌ర్ల‌ను కోరుకుంటున్నారని ఆ దిశగా మేకర్స్ అడుగులు వేయాలని ఆయన కోరారు. 

కోవిడ్ తర్వాత ప్రేక్షకుల సినిమా చూసే విధానం మారిపోయిందని, ఈ మార్పులకు అలవాటు పడటం తనకు అప్పుడప్పుడు కష్టంగా అనిపిస్తోందని ఆయన నిజాయితీగా ఒప్పుకున్నారు. షాహిద్ నటించిన గత కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. అందుకే, ఇప్పుడు తన స్టార్‌డమ్‌ను మళ్లీ నిలబెట్టుకోవడానికి `ఓ రోమియో` వంటి బలమైన కథ అవసరమని షాహిద్ భావిస్తున్నారు.

షాహిద్ కపూర్ సరసన ఈ చిత్రంలో ట్రిప్తి దిమ్రీ నటిస్తోంది. అలాగే `లైలా మజ్ను` ఫేమ్ అవినాష్ తివారీ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. విలక్షణ దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన కమీనీ, హైదర్ వంటి చిత్రాలు క్లాసిక్స్‌గా నిలిచాయి. 

ఈ చిత్రం ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ వీక్ సందర్భంగా విడుదల కానుంది. షాహిద్ కపూర్ ప్రస్తుతం తన కెరీర్‌లో ఒక క్లిష్టమైన దశలో ఉన్నారు. ఒకవైపు నటుడిగా మంచి గుర్తింపు ఉన్నా, కమర్షియల్ సక్సెస్ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు. `ఓ రోమియో` అత‌డి కెరీర్ కి ఆ ఊపును అందిస్తుందో లేదో చూడాలి.

Shahid Kapoor says business-first mindset is damaging Hindi cinema:

O Romeo - Shahid Kapoor

Tags:   SHAHID KAPOOR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ