Advertisementt

నెట్ ఫ్లిక్ - ట్రెండింగ్ లో లేని దురంధర్ 

Sun 01st Feb 2026 09:47 AM
ranveer singh  నెట్ ఫ్లిక్ - ట్రెండింగ్ లో లేని దురంధర్ 
Dhurandhar streaming now on Netflix నెట్ ఫ్లిక్ - ట్రెండింగ్ లో లేని దురంధర్ 
Advertisement
Ads by CJ

థియేటర్స్ లో బిగ్ బ్లాక్ బస్టర్ అయిన సినిమాకి ఓటీటీ లో ఎంత క్రేజ్ ఉంటుంది. ఆ సినిమా ఓటీటీ లోకి వస్తే టాప్ లో ట్రెండ్ అవడం ఖాయం. థియేటర్స్ లో చూసినా మరోసారి ఓటీటీ లో అన్ కట్ వెర్షన్ చూడాలని తపనపడే ఆడియన్స్ చాలామంది ఉంటారు. అందుకే థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయిన బొమ్మకు ఓటీటీలోనూ గిరాకీ ఉంటుంది.

డిసెంబర్ లో బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన రికార్డ్ కలెక్షన్స్ తో సంచలనాలకు తెరలేపిన దురంధర్ చిత్రం 50 రోజుల తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుండి స్ట్రీమింగ్ లోకి వచ్చింది. అయితే నెట్ ఫ్లిక్స్ దురంధర్ ని ఓటీటీ స్ట్రీమింగ్ చేసే కొన్ని గంటల వరకు సరైన ప్రకటన ఇవ్వలేదు, అసలు చాలామందికి జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ లోకి రాబోతున్న విషయమే ఎవరికీ తెలియదు.

ఎలాంటి హడావిడి లేకుండా దురంధర్ ని ఓటీటీ స్ట్రీమింగ్ లోకి తేవడం, అలాగే ఓటీటీ వెర్షన్ ను కుదించడం, చాలా సన్నివేశాల్లో బీప్ వెయ్యడం ప్రస్తుతం సోషల్ మీడియాలో దురంధర్ ఓటీటీ వెర్షన్ పై వస్తున్న కామెంట్లు అన్ని దురంధర్ ఓటీటీ వెర్షన్ ని వీక్ చేసాయి. మరోపక్క దురంధర్ ఓటీటీ లో సౌండ్ ఎఫెక్ట్స్ లేకపోవడం, థియేటర్స్ లో ఉన్న క్వాలిటీ ఓటీటీ లో లేదు. 

అందుకే దురంధర్ నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లోకి రాలేదు అంటున్నారు. దీనంతటికి కారణం నెట్ ఫ్లిక్స్ అంటూ చాలామంది మూవీ లవర్స్ నెట్ ఫ్లిక్స్ పై ఫైర్  అవుతున్నారు.  

Dhurandhar streaming now on Netflix:

Ranveer Singh Blockbuster Dhurandhar Streams On Netflix 

Tags:   RANVEER SINGH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ