రాజకీయాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరు చెప్పే మాటే కోలీవుడ్ హీరో విజయ్ కూడా చెబుతున్నారు. టీవీకే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంటర్ అవడమే కాదు.. భారీ బహిరంగ సభలు, ఫ్యాన్స్ మీట్ అంటూ రాజకీయ నాయకుడు మాదిరి విజయ్ ముందు కదులుతున్నారు. సినిమాల్లో తనని అభిమానించేవారంతా తన వెనుకే నిలవాలని ఆయన కోరుకుంటున్నారు.
అంతేకాదు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన గెలుపుపై ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మా పార్టీ విజయం సాధిస్తుంది. కింగ్ మేకర్ అనే ప్రశ్న లేదు. నేను పెట్టే సభలకు వస్తున్న ప్రజలను చూస్తుంటే.. గెలుపు ఖాయమనిపిస్తుంది. వారి స్పందన ఎలా ఉందో మీరే ఊహించుకోవచ్చు.
నేను ఓ ఐదేళ్ల కోసం, అధికారం కోసమో రాజకీయాల్లోకి రాలేదు. ప్రజల సంక్షేమం నాకు ముఖ్యం. ఎక్కువ కాలం రాజకీయాల్లోనే కొనసాగుతాను. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ వదిలేసి రాజకీయాలపైనే దృష్టిపెట్టాను. సినిమాను వదిలేయడం అంత సులభం కాలేదు అంటూ విజయ్ తన పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేసారు.




ధనుష్ తో శ్రీలీల రొమాన్స్ 
Loading..