వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబు, పవన్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సీఎం స్థానంలో ఉన్న జగన్ వెనకేసుకొచ్చారు. కానీ ప్రజలు వాటి తాట తీసి ఇంటికి పరిమితం చేశారు. ఇక అధికారం పోయాక కూడా వైసీపీ నేతల్లో బలుపు తగ్గలేదు.
అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరిని బొక్కలో తోసేశారు. దెబ్బకు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు కామ్ గా కూర్చున్నారు. కానీ మాజీ మంత్రులు మాత్రం ఇంకా ఇంకా సీఎం స్థానంలోకి వచ్చాక కూడా చంద్రబాబు పై రెచ్చిపోయి కారు కూతలు కూస్తున్నారు.
తిరుపతి లడ్డు లో కల్తీ నెయ్యి వ్యవహారంలో టీడీపీ vs వైసీపీ అన్న రేంజ్ లో ఏపీలో ఫ్లెక్సీ లు వెలుస్తున్నాయి. అందులో భాగంగా గుంటూరు గోరంట్ల వద్ద టీడీపీ నేతలు లడ్డూ కల్తీ వ్యవహారంపై ఓ ఫ్లెక్సీ పెట్టారు. అందులో జగన్ ఫోటో ఉండడంతో అంబటి ఆ ఫ్లెక్సీ తీసేస్తామంటూ మీడియాలో హెచ్చరించడమే కాదు..
గోరంట్లలోని ఓ ఆలయం దగ్గర నుంచి ఫ్లెక్సీ తీస్తామని బయలుదేరారు. కానీ అప్పటికే అక్కడికి టీడీపీ కార్యకర్తలు అక్కడ పెద్ద ఎత్తున గుమికూడి ఉండటంతో పోలీసులు అంబటిని అక్కడ్నుంచి పంపేశారు. దానితో అంబటి కారులో నుంచి తల బయటికి పెట్టి మరీ చంద్రబాబు ఆయన కుటుంబం మొత్తంపై బండబూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు.
చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలను చేసిన అంబటిని అరెస్ట్ చెయ్యాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.




ప్రముఖ దర్శకుడు కొడుకుపై క్రిమినల్ కేసులు 
Loading..