Advertisementt

ప్రముఖ దర్శకుడు కొడుకుపై క్రిమినల్ కేసులు

Sat 31st Jan 2026 04:24 PM
teja  ప్రముఖ దర్శకుడు కొడుకుపై క్రిమినల్ కేసులు
Telugu film director Son Booked in Kidnap Extortion Case ప్రముఖ దర్శకుడు కొడుకుపై క్రిమినల్ కేసులు
Advertisement
Ads by CJ

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ కొడుకు అమితోవ్ తేజ పై క్రిమినల్ కేసులు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. దర్శకుడు తేజ కొడుకు సినిమా ఇండస్ట్రీ పై పెద్దగా ఫోకస్ చెయ్యలేదు, అతను అతని బిజినెస్ వ్యవహారాలంటూ  ఉండేవాడు, కొన్నాళ్ల క్రితం అమితోవ్ తేజ పేరు మీడియాలో వినిపించింది. 

రీసెంట్ గా ఓ మహిళను బెదిరించడం, అసభ్యకర ప్రవర్తన, కిడ్నాప్ అంటూ అమితోవ్ తేజ పై కేసు నమోదు అయ్యింది. గత ఏడాది  క్రెడిట్ కార్డు దరఖాస్తుల విషయమై అమితోవ్ తేజతో ప్రణీత్‌ అనే వ్యక్తికు పరిచయం ఏర్పడి, కొద్ది కాలంలోనే అమితోవ్ తేజ, ప్రణీత్, అతని భార్య కలిసి షేర్ మార్కెట్‌లో ఒక అకౌంట్ తెరిచి ట్రేడింగ్ ప్రారంభించారు.

షేర్ మార్కెట్ లో వచ్చిన నష్టాల విషయంలో అమితోవ్ తేజ కు ప్రణీత్‌కు మధ్యన విభేదాలు తలెత్తడం, గత ఏడాది మే లో ప్రణీత్‌ను అక్రమంగా నిర్బంధించి ఖాళీ పేపర్లు, చెక్కులు, ఆస్తి పత్రాలపై సంతకాలు చేయించారన్న ఆరోపణలపై అమితోవ్ తేజ పై లో కేసులు నమోదయ్యాయి.

Telugu film director Son Booked in Kidnap Extortion Case:

Extortion case registered against film director Teja son

Tags:   TEJA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ