మృణాల్ ఠాకూర్ పేరు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కోలీవుడ్ హీరో ధనుష్ ని మృణాల్ ప్రేమ పెళ్లి చేసుకోబోతుంది, మృణాల్ ఠాకూర్ తమిళంలోకి గ్రాండ్ గా డెబ్యూ తో ఎంట్రీ ఇవ్వబోతుంది.. అంటూ కొన్ని న్యూస్ లు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే మృణాల్ ఠాకూర్ తమిళ డెబ్యూ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యింది అంటున్నారు. డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో శింబు హీరోగా నటిస్తున్న STR 51 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ రొమాంటిక్ డ్రామాలో మృణాల్ ఠాకూర్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈలోపు మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పిక్స్ చూసినవారు వావ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. లూజ్ హెయిర్ తో మృణాల్ ఠాకూర్ లుక్ సింపుల్ గానే ఉన్నా.. నాజూగ్గా కనిపించిన తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు.




కీర్తి భట్టే నన్ను వద్దనుకుంది - కార్తీక్ విజయ్ 
Loading..