స్టార్ మా సీరియల్ లో చూసి అబ్బో ఈ అమ్మాయిని సీరియల్ హీరోయిన్ చేసారేమిట్రా అని చాలామంది అనుకున్న అమ్మాయి కీర్తి భట్. మనసిచ్చి చూడు తో స్టార్ మా లోకి ఎంటర్ అయిన కీర్తి భట్ ఆ తర్వాత బిగ్ బాస్ లో కనిపించడమే కాదు, ఆమె లైఫ్ లో జరిగిన యాక్సిడెంట్, కుటుంబ సభ్యులను కోల్పోయి ఒంటరిగా మిగిలిన బాధాకరమైన సంఘటన గురించి విన్నాక ఆమెపై అందరూ సింపతీ చూపించారు.
ఆ తర్వాత కార్తీక్ అనే కుర్రాడితో కలిసి డాన్స్ షోస్, ఫ్యామిలీ ఈవెంట్స్, ఫెస్టివల్ షోస్ లో కనిపించడమే కాదు కార్తీ ని గత ఏడాది కీర్తి భట్ ప్రేమికుడిగా పరిచయం చేసి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ పెళ్లి చేసుకోకుండానే కీర్తి భట్ కార్తీక్ తో విడిపోయింది. ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా కీర్తి భట్ పోస్ట్ పెట్టింది.
దానితో చాలామంది కార్తీక్.. మీ మధ్యలో ఏమైనా గొడవలు ఉంటె కూర్చుని మట్లాడుకోండి, కీర్తి భట్ తో సాటౌట్ చేసుకోండి అంటూ కార్తీక్ కి చెప్పడం, కార్తీక్ విజయ్ ని ట్రోల్ చెయ్యడంతో.. కార్తీక్ సోషల్ మీడియాలో లైవ్ కి వచ్చి తనతో కీర్తి భట్ విడిపోయింది, నేను ఆ బంధం నుంచి బయటికి రావాలని కోరుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు.
తాను కీర్తిని వదిలేశానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆమే తనను వదిలి వెళ్ళిపోయింది. తానింకా ఫైనాన్షియల్‌గా సెటిల్ కాలేదనే బలమైన కారణంతోనే కీర్తి ఈ నిర్ణయం తీసుకుందని, తాను తన లైఫ్ లో కొత్త చాప్టర్ స్టార్ట్ చేసేసింది. తాను కీర్తి ని వద్దనుకోలేదు, కీర్తి నే తనని వద్దనుకుంది అంటూ కార్తీక్ అసలు విషయాన్ని రివీల్ చేసాడు.




ప్రభాస్ ఫౌజీ లాక్ రిలీజ్ డేట్ 
Loading..