సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఐదు సినిమాల్లో మూడు మంచి హిట్ అవ్వగా.. ఒక సినిమా యావరేజ్ గా నిలిచింది, మరో సినిమా ప్లాప్ లిస్ట్ లోకి వెళ్ళింది. అందులో మన శంకర వరప్రసాద్ గారు అఫీషియల్ గా 350 కోట్లు కొల్లగొట్టేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక అనగనగ ఒకరాజు 100 కోట్లకు పైగానే షేర్ తెచ్చుకుని చిన్న సినిమా పెద్ద హిట్ అనిపించుకుంది.
శర్వానంద్ నారి నారి నడుమ మురారి.. హిట్ టాక్ వచ్చినా కానీ కలెక్షన్స్ అఫీషియల్ పోస్టర్ వేసి చెప్పలేదు. ఇక రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి.. యావరేజ్ అనిపించుకుంది. రాజసాబ్ ప్లాప్ అయ్యింది. మరి గత రెండు వారాలుగా థియేటర్స్ లో సంక్రాంతి సినిమాలే దోచుకుంటున్నాయి.
ప్రేక్షకులకు అవి తప్ప మరో ఆప్షనే లేదు. ఇక సంక్రాంతి మత్తు వదిలితే రేపు శుక్రవారం రాబోయే సినిమాలను ఓ చూపు చూడాలి ప్రేక్షకులు. అందులో ముఖ్యంగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ లు కలిసి నటించిన ఓం శాంతి శాంతి శాంతిః చిత్రం పై అంచనాలున్నాయి. మంచి ప్రమోషన్స్, కపుల్స్ కి ఒక టికెట్ కొంటె మరో టికెట్ ఫ్రీ. సో ఈ సినిమా కాస్త ఆడియన్స్ కనెక్ట్ అయితే సంక్రాంతి మత్తు ఆటోమాటిక్ గా వదిలిపోతుంది.
దానితో ఫిబ్రవరి 6 న రాబోయే సినిమాలపై కాసింత ఆడియన్స్ లో క్రేజ్ పెరుగుతుంది. లేదంటే కష్టం.




స్పిరిట్ హీరోయిన్ మెరుపులు 
Loading..