పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సందీప్ వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీ షూటింగ్ కొత్త షెడ్యూల్ వచ్చే నెల మొదటి వారంలో డెహ్రాడూన్ లో మొదలు పెట్టబోతున్నాడు. ప్రభాస్ ఇంకా కీలక నటుల మీద సందీప్ వంగ ఓ 20 రోజుల భారీ షెడ్యూల్ ని చిత్రీకరించనున్నగా తెలుస్తుంది.
ఈ చిత్రంలో ప్రభాస్ కి జోడిగా ముందు దీపికా పదుకొనె ను అనుకుని, తర్వాత ఆమె డిమాండ్స్ కారణంగా దర్శకుడు సందీప్ రెడ్డి దీపికా ను తప్పించి యానిమల్ లో సెకండ్ హీరోయిన్ గా నటించిన త్రిప్తి డుమ్రిని హీరోయిన్ గా ఎంపిక చేసారు. దానితో త్రిప్తి డుమ్రి ఒక్కసారిగా ట్రెండ్ అయ్యింది. యానిమల్ లో త్రిప్తి డుమ్రి బోల్డ్ గా అద్దరగొట్టేసింది.
ఇప్పుడు ప్రభాస్ పక్కన అనేసరికి త్రిప్తి డుమ్రి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ కనిపిస్తే దానిని ప్రభాస్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా త్రిప్తి డుమ్రి వైట్ డ్రెస్ ఫొటో షూట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఏంజెల్ లా బ్యూటిఫుల్ గా మెరుపులు మెరిపించింది త్రిప్తి డుమ్రి.




విశ్వంభర రిలీజ్ డేట్ రివీల్ చేసిన చిరు
Loading..