తనని హీరోయిన్ గా బాలీవుడ్ కి పరిచయం చేసి, వెన్నంటి ఉంటూ తనకి మంచిదో, చెడేదో చెప్పిన ధర్మ ప్రొడక్షన్ నుంచి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ బయటికి వచ్చెయ్యడం అందరికి షాకిచ్చింది. బోని కపూర్ జాన్వీ కపూర్ ని ధర్మ ప్రొడక్షన్ అధినేత కరణ్ జోహార్ చేతుల్లో పెట్టారు. ఆ ప్రొడక్షన్ హౌస్ జాన్వీ కపూర్ సినిమాల విషయంలో అయినా, ఆమె ఏ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చెయ్యాలనే విషయంలో సజెస్ట్ చేసేవారు.
కానీ ఇప్పుడు జాన్వీ కపూర్ ధర్మ ప్రొడక్షన్స్ నుంచి బయటికి వచ్చేసి ఓన్ డెసిషన్స్ తీసుకుంటుంది. అందులో భాగంగానే కలెక్టివ్ ఆర్టిస్ట్ నెట్‌వర్క్ అనే కొత్త ప్రొడక్షన్ హౌస్ తో జాన్వీ కపూర్ డీల్ కుదుర్చుకోవడం అందరిని విస్మయానికి గురి చేసింది.
అయితే జాన్వీ కపూర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉంది అని, ఆమె ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్స్ కన్నా ఎక్కువగా సౌత్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టడం, అలాగే నేపోకిడ్ అనే ట్యాగ్ నుంచి బయటపడేందుకు జాన్వీ కపూర్ ఇలాంటి డెసిషన్ తీసుకుంది అంటూ ఆమె సన్నహిత వర్గాల మాట.




మారుతి మళ్లీ డౌన్ అవ్వాల్సిందేనా
Loading..