`ది రాజాసాబ్ హిట్` అయితే గనుక మారుతి కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకునేది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని డైరెక్షన్ చేసిన అనుభవంతో స్టార్ లీగ్ లో చేరిపోయేవాడు. అక్కడ నుంచి పాన్ ఇండియా హీరోలే టార్గెట్ గా కథలు రాసి పని చేసేవాడు. మహేష్, బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ అంటూ కొత్త ప్రయాణం మొదలు పెట్టేవాడు.
పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లో అకాశాలు వచ్చేవి. పారితోషికం రెండింతలు రెట్టింపు అయ్యేది. భారీ లాభాలొస్తే సినిమా లాభాల్లో వాటా కూడా అందుకునేవాడు. రాజాసాబ్ విజయం సాధిస్తే గనుక మారుతి గ్రాఫ్ ఇలా ఉండేది. మరిప్పుడు ఎలా ఉంది? అంటే? మారుతి మళ్లీ డౌన్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నట్లే ఉంది.
అతడి సామర్ద్యం, పనితనాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలు లేదు గానీ... ప్రస్తుతం హీరోలున్న బిజీ షెడ్యూల్ తో ఇప్పటికిప్పుడు మారుతి స్టార్స్ తో ఛాన్స్ అందుకోవడం అంత సులభం కాదు. స్టార్ హీరోలంతా బిజీగా ఉన్నారు. టైర్ -2, టైర్ -3హీరోల లైనప్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. ఏ హీరో కూడా ఖాళీగా లేడు.
ఒక సినిమా సెట్స్ లో ఉండగానే మరో సినిమా లైన్ లో పెట్టుకున్నారు. నచ్చిన కథలు లాక్ చేసి పెట్టుకుంటున్నారు. వాటికి డైరెక్టర్లను సెట్ చేసుకుంటున్నారు. మంచి కథ అందించిన వాళ్లపై డీల్ చేయగలడు అన్న నమ్మకం కలిగితే అనుభవంతో పనిలేకుండా దర్శకత్వం బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇలా హీరోలంతా ఎంతో ప్రీ ప్లాన్డ్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఇలాంటి పోటీ నడుమ మారుతి కొత్త ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుందో చూడాలి.




కింగ్ 100 - నాగ్ తో టబు.. క్లారిటీ 
Loading..