Advertisementt

రవితేజ బర్త్ డే స్పెషల్ వచ్చేసింది

Mon 26th Jan 2026 11:05 AM
ravi teja  రవితేజ బర్త్ డే స్పెషల్ వచ్చేసింది
RT77 gets spiritual title రవితేజ బర్త్ డే స్పెషల్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రం విడుదలైన వెంటనే మాస్ రాజా రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్ లోకి వెళ్లిపోయారు. కొన్నేళ్లుగా అంటే ధమాకా తర్వాత సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న రవితేజ కు భర్త మహాశయులకు విజ్ఞప్తి కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఆ చిత్రం యావరేజ్ టాక్ తో సంక్రాంతి బరిలో నిలిచింది. దానితో రవితేజ కాస్త కోలుకున్నారు.

ప్రస్తుతం రవితేజ తన తదుపరి చిత్రాన్ని ఫ్యామిలీ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈరోజు జనవరి 27 రవితేజ బర్త్ డే. రవితేజ బర్త్ డే స్పెషల్ గా రవితేజ-శివ నిర్వాణ ల మూవీ ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ రివీల్ చేసారు మేకర్స్. రవితేజ న్యూ టైటిల్ డివోషనల్ గా కనిపిస్తుంది.

అయ్యప్ప స్వామి మాలలో ఇరుముడి అంటూ రవితేజ తన బర్త్ డే కి ఫస్ట్ లుక్ తో అభిమానులకు ట్రీట్ ఇచ్చేసారు. అయ్యప్ప మాలలో నల్లటి వస్త్రాల్లో తలపై ఇరుముడి కట్టి చేతిలో పాప ను ఎత్తుకుని రవితేజ చాలా ఎనేర్జి గా కనిపించారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మాస్ మహారాజ్ రవితేజ కు సినీ జోష్ టీం విషెస్ తెలియజేస్తుంది. 

RT77 gets spiritual title:

RT77 titled Irumudi, First look out

Tags:   RAVI TEJA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ