కొద్దిగా గ్యాప్ ఇవ్వండి సర్.. అంటూ ఏ హీరోని ఆడియన్స్ అడుగుతున్నారో తెలుసా.. ఆయనే మాస్ మహారాజ్ రవితేజ ను. గత ఏడాది మాస్ జాతర విడుదలైన మూడు నెలలకే రవితేజ కిశోర్ తిరుమల దర్శకత్వంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాని సంక్రాంతి సీజన్ లో నిలిపారు. అందులో వింతేమీ లేదు. రవితేజ స్పీడు అంలాంటిది.
ఆయన హడావిడిగా సినిమాలు చేస్తున్నారు కానీ.. సరైన కథలను, సరైన దర్శకులను ఎంచుకోవడం లేదు అని ఆయన అభిమానుల బాధ. రవితేజ ఆచి తూచి అడుగెయ్యాలని ఆయన అభిమానులు సూచిస్తున్నారు. భర్త మహాశయులకు ఏదో యావరేజ్ అయ్యింది కానీ.. లేదంటే రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్ చేరేది.
మరి రవితేజ భర్త మహాశయుల పనైపోయింది అంటూ తన తదుపరి మూవీ సెట్ లోకి ఎంటర్ అయ్యారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ తన తదుపరి ప్రాజెక్ట్ స్టార్ట్ చెయ్యడమే కాదు జనవరి 26 అంటే రేపు RT 77 ఫస్ట్ లుక్ అంటూ అనౌన్స్ చెయ్యడం చూసి అందరూ కాస్త గ్యాప్ ఇవ్వండి గురుగారు అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.




ఆ రెండు సినిమాల మధ్య మెగా క్లాష్

Loading..