Advertisementt

మైండ్ బ్లోయింగ్ - స్పిరిట్ డైరెక్టర్ లైనప్

Sun 25th Jan 2026 05:44 PM
spirit  మైండ్ బ్లోయింగ్ - స్పిరిట్ డైరెక్టర్ లైనప్
Mind-blowing-Spirit director lineup మైండ్ బ్లోయింగ్ - స్పిరిట్ డైరెక్టర్ లైనప్
Advertisement
Ads by CJ

స్థార్ హీరోలు, పాన్ ఇండియా హీరోల లైనప్ కోసం అభిమానులు ఎదురు చూస్తారు. ఆయా హీరోల లైనప్ చూసి ఫ్యాన్స్ కి పిచ్చెక్కపోతుంది. కానీ కొంతమంది దర్శకుల లైనప్ కోసం కామన్ ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో రాజమౌళి, ప్రశాంత్ నీల్, సుకుమార్, సందీప్ వంగ లాంటి వాళ్ళు ఉంటారు.

వాళ్లలో కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ లైనప్ పై మాస్ ఆడియన్స్ కి కన్ను ఉంటుంది. పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా సందీప్ రెడ్డి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ షూటింగ్ మొదలు పెట్టారు. యానిమల్ తర్వాత ప్రభాస్ కోసం ఆయన మూడేళ్లు వెయిట్ చేసారు. స్పిరిట్ 2027 లో విడుదలవుతుంది.

ఆతర్వాత ఆయన యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ చేస్తారు. సందీప్ రెడ్డి రణబీర్ కపూర్ తో తెరకెక్కించిన యానిమల్ హిట్ అవడంతో దానికి సీక్వెల్ గా యానిమల్ పార్క్ ప్రకటించారు. అది 2029 లో వస్తుంది అని అంచనా. ఆతర్వాత సందీప్ రెడ్డి వంగ మహేష్, అల్లు అర్జున్ లతో సినిమాలు చెయ్యాలనుకున్నా ఆయన అల్లు అర్జున్  తో మూవీకి కమిట్ అవడమే కాదు అఫీషియల్ అనౌన్సమెంట్ ఇచ్చారు.

యానిమల్ పార్క్ తర్వాత సందీప్ వంగ అల్లు అర్జున్ తోనే సెట్ లోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ 2031 లో ఉంటుందేమో చూడాలి. 

Mind-blowing-Spirit director lineup:

Spirit director Sandeep Reddy Vanga lineup

Tags:   SPIRIT
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ