మలయాళంలో సూపర్ హిట్ అయిన బేసిల్ జోసెఫ్-దర్శన ల కాంబోలో వచ్చిన జయ జయ జయ జయహే మూవీని తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా లు ఓం శాంతి శాంతి శాంతిః గా రీమేక్ చేసారు. జయ జయ జయ జయహే లో బేసిల్ జోసెఫ్ కోళ్ల వ్యాపారం చేస్తే ఈ ఓం శాంతి శాంతి శాంతిః లో తరుణ్ భాస్కర్ చేపల వ్యాపారం చేస్తాడు. అంతే తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ అనిపించేలా తాజాగా ఓం శాంతి శాంతి శాంతిః ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.
ఈ నెల 30 న ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఓం శాంతి శాంతి శాంతిః చిత్రం పై అంచనాలు పెంచేలా ప్రమోషన్స్ ఉన్నాయి. కాకపోతే మలయాళంలో తెరకెక్కిన జయ జయ జయ జయహే మూవీ ని ఓటీటీ వేదికగా తెలుగులో చూడకపోతే ఈ ఓం శాంతి ఇక్కడ వర్కౌట్ అవుతుంది.
బేసిల్ జోసెఫ్ పెళ్లి వరకు ఒకలా పెళ్లి తర్వాత తన చెప్పు చేతల్లో భార్య ఉండాలని కోరుకునే మనస్తత్వం వున్నవాడు, కానీ భర్త ఆగడాలు భరించలేక ఇంట్లోనే బాక్సింగ్ నేర్చుకుని భర్తను భయపెట్టే దర్శన లా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బలు కనిపించబోతున్నారు. మరి ఈ చిత్రాన్ని తెలుగు లో ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో జస్ట్ వెయిట్ అండ్ వాచ్.




ప్రభాస్ దే తప్పా

Loading..