ప్రభాస్ తప్పు చేస్తున్నారా.. ఒకదాని మీద ఒకటి సినిమాలను ఒప్పుకుంటూ దర్శకనిర్మాతలను హోల్డ్ లో పెడుతూ.. వాళ్ళను ఇబంది పెడుతున్నారా, అందుకే ఆయనకు సరైన అవుట్ ఫుట్ ని దర్శకులు ఇవ్వలేకపోతున్నారా, ప్రభాస్ సరిగ్గా డేట్స్ ఇవ్వకుండా, తనెప్పుడిచ్చినా డేట్స్ వాడుకునే దర్శకులని ఆయన ఎంచుకుంటున్నారా, ప్రభాస్ ఒప్పుకుంటే చాలు అని దర్శకులు కాంప్రమైజ్ అవుతున్నారా.. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో కనిపిస్తున్న కామెంట్లు.
ఏడాదికి పూర్తి కావాల్సిన రాజాసాబ్ ని ప్రభాస్ డేట్స్ కారణంగానే మూడేళ్లు పట్టింది అనేది వాస్తవం, ప్రభాస్ డేట్స్ ని బట్టి సినిమా చిత్రీకరణ ను దర్శకుడు మారుతి ప్లాన్ చేసుకోవడం, ఆ డేట్స్ కి సరిపోయే హీరోయిన్స్ ఎంపిక అన్ని రాజసాబ్ ని ముంచేసాయి. ముఖ్యంగా నిర్మాత రాజసాబ్ వల్ల చాలా నష్టపోయారు. కారణం ఏళ్ళ తరబడి సినిమా సెట్ పై ఉండడం నిర్మాతకు నష్టం వచ్చేలా చేసింది
ప్రభాస్ ఒక సినిమా తర్వాత ఒకటి చెయ్యొచ్చు కదా, రాజాసాబ్ ని పెట్టుకుని ఫౌజీ అన్నాడు, అది కాస్త పూర్తి కాగానే స్పిరిట్ సెట్ లోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఫౌజీ దర్శకనిర్మాతల పరిస్థితి ఏమిటి అనేది అందరిలో మెదులుతున్న పెద్ద ప్రశ్న. స్పిరిట్ తో పైపాటుగా కల్కి 2 అంటున్నారు. అసలు ప్రభాస్ ఏం చేస్తున్నారు.
ఆయన కారణంగా మధ్యలో దర్శకనిర్మాతలు నలిగిపోతున్నారు అనేది సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్న మాట. మరి ఈ విషయాన్ని ప్రభాస్ సీరియస్ గా తీసుకుంటే సరి, లేదంటే ఆయన పేరు కూడా పోతుంది మరి.




అందుకే పెద్ది సైలెంట్ అయ్యిందా 

Loading..