Advertisementt

చిన్న హిట్టు పెద్ద ఆనందం

Fri 23rd Jan 2026 07:00 PM
nari nari naduma murari  చిన్న హిట్టు పెద్ద ఆనందం
Nari Nari Naduma Murari hit చిన్న హిట్టు పెద్ద ఆనందం
Advertisement
Ads by CJ

నిజమే చిన్న సినిమా హిట్ అయితే నిర్మాతకు పెద్ద ఆనందమే. అందులోను ఆరేళ్ళ తర్వాత హిట్ అంటే మాములు విషయం కాదు కదా.. అదే ఇప్పుడు నిర్మాత అనిల్ సుంకర అనుభవిస్తున్నారు. 2020 లో మహేష్ సరిలేరు నీకెవ్వరూ తర్వాత ఏజెంట్, భోళా శంకర్ లాంటి భారీ డిజాస్టర్స్ చూశారాయన.

మళ్ళీ ఆరేళ్లకు అదే సంక్రాంతికి అనిల్ సుంకర నారి నారి నడుమ మురారి తో మంచి హిట్ అందుకున్నారు. చిన్న సినిమానే, మీడియం బడ్జెట్ మూవీ నే. కానీ ఆ సంతోషం మాత్రం మిలియన్ డాలర్స్ ఆనందం. అదే అనిల్ సుంకర కళ్ళల్లో కనిపిస్తుంది. 

శర్వానంద్ తో చేసిన నారి నారి నడుమ మురారి చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై బిగ్ హిట్ గా నిలిచింది. కలెక్షన్స్ పోస్టర్ వేయకపోయినా.. సక్సెస్ సెలెబ్రేషన్స్ అంటూ చేస్తున్న హడావిడి, వారి సంతోషాలు చూసి అనిల్ సుంకర ఈ సినిమా తో ఒడ్డున పడిపోయారనేది నిజమనిపిస్తుంది.

Nari Nari Naduma Murari hit:

Nari Nari Naduma Murari update

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ