డిసెంబర్ లో నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన అఖండ 2 భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా థియేటర్స్ లో విడుదలైన ప్లాప్ అయ్యింది. థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ అఖండ 2 పెరఫార్మెన్స్ వీక్ గానే కనిపించింది. దర్శకుడు బోయపాటి పాన్ ఇండియా పిచ్చితో అఖండ 2 ని అతలాకుతలం చేసాడు, బాలయ్య అఘోర గెటప్ తప్ప ఆకట్టుకున్న అంశాలేవీ లేవు అని ఆడియన్స్ పెదవి విరిచారు.
అఖండ 2 విడుదలైంది, డిజప్పాయింట్ చేసింది. మరి అఖండ 2 విడుదలకు ముందే బాలయ్య గోపీచంద్ మలినేని తో NBK 111 ప్రాజెక్ట్ అనౌన్స్ చెయ్యడము, దానిని పూజ కార్యక్రమాలతో మొదలు పెట్టడమే కాదు దానికోసం హీరోయిన్ గా నయనతారను ఎంపిక చేసి అనౌన్స్ చెయ్యడం అన్ని చూసాం. అంతే కాదు రాజస్థాన్ లో NBK 111 కోసం లొకేషన్స్ ను ఎంపిక చేసుకున్నారు.
అయితే అఖండ 2 ప్లాప్ తర్వాత NBK 111 బడ్జెట్ విషయమై నిర్మాతలు మల్లగుల్లాలు పడుతున్నారు, ఈ ప్రాజెక్ట్ నుంచి నయనతార తప్పుకుంది అనే టాక్ వినిపించింది. ఒక సినిమా విడుదల కాగానే తన తదుపరి ప్రాజెక్ట్ పైకి వెళ్లిపోయే బాలయ్య NBK 111 విషయంలో ఎందుకో ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తుంది.
ఆ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు, రీసెంట్ గానే గోపీచంద్ మలినేని తిరుమల శ్రీవారిని దర్శించుకుని రావడంతో NBK 111 రెగ్యులర్ షూట్ మొదలవుతుంది అనుకున్నారు. కాని NBK 111 ప్రాజెక్ట్ చప్పుడు మాత్రం వినిపించడమే లేదు.




పెద్ది కోసం పేలిపోయే ఐటమ్ గర్ల్ 

Loading..