Advertisementt

మిల్కీబ్యూటీ మ‌న‌సంతా అక్క‌డే ఉందా!

Thu 22nd Jan 2026 08:29 PM
tamannaah  మిల్కీబ్యూటీ మ‌న‌సంతా అక్క‌డే ఉందా!
Tamannaah reported shift from South films మిల్కీబ్యూటీ మ‌న‌సంతా అక్క‌డే ఉందా!
Advertisement
Ads by CJ

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా  సౌత్ సినిమాలు త‌గ్గించి బాలీవుడ్ చిత్రాల‌పై దృష్టి పెడుతోందా? ఇక‌పై అమ్మ‌డు హిందీ సినిమాలే టార్గెట్ గా ప‌ని చేయ‌బోతుందా? అంటే అవున‌నే లీకులందుతున్నాయి. ఇంత‌కాలం అమ్మ‌డు ద‌క్షిణాది ఉత్త‌రాది చిత్రాల‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ వ‌చ్చింది. ఏ భాష‌ను కాద‌న‌కుండా..ఎవ‌ర్నీ నొప్పించుకుండా ప‌ని చేసింది. కెరీర్ లో ఏనాడు ఎలాంటి వివాదాల్లో త‌ల దూర్చ‌ని త‌మ‌న్నా?  ముగింపు వేళ కాంట్ర‌వ‌ర్శీ ఎందుక‌ని దేనికి  ఛాన్స్ ఇవ్వ‌కుండా ప‌ని చేసుకుంటూ వ‌చ్చింది.

కానీ  కొత్త ఏడాదిలో మాత్రం కెరీర్ ని కొత్త‌గానే ప్లాన్ చేస్తున్న‌ట్లు ఉప్పందింది. కెరీర్ విషయంలో అమ్మ‌డు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమన్నా బాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మక చిత్రాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్నఓ సినిమాతో పాటు, కరీనా కపూర్ క్రూ 2, గోల్‌మాల్ 5,  మడాక్ ఫిలిమ్స్ హారర్-కామెడీ యూనివర్స్‌ ప్రాజెక్ట్ ల్లోకి ఎంట‌ర్ అవ్వాల‌న్న‌ది త‌మ‌న్నా ప్లాన్ గా తెర‌పైకి వ‌స్తోంది.

ఇప్ప‌టికే ఆయా టీమ్ ల‌తో అమ్మ‌డు మ‌మేకం అయింద‌ని బాలీవుడ్ మీడియా క‌థ‌నాలు వెడెక్కిస్తున్నాయి. యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ సరసన నటించాల్సిన నాగ్‌జిల్లా నుండి త‌మ‌న్నా తప్పుకోవడానికి డేట్స్ సర్దుబాటు కాకపోవడమే కారణమని వెలుగులోకి వ‌చ్చింది. కానీ ఈ ఛాన్స్ వ‌ద‌లుకోవ‌డం వెనుక మాస్ట‌ర్ ప్లాన్ ఉంద‌న్న‌ది తాజా ప్ర‌చారం. కెరీర్ ప్లానింగ్‌లో భాగమేనని  స్కిప్ కొట్టింద‌ని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్ర‌స్తుతం షాహిద్ క‌పూర్ హీరోగా న‌టిస్తోన్న ఓ రోమియోలో న‌టిస్తోంది. అలాగే సిద్దార్ద్ మ‌ల్హోత్రా ప్రాజెక్ట్  వ్యాన్ లోనూ న‌టిస్తోంది. ముంబై మాజీ క‌మీష‌న‌ర్ రాకేష్ మరియా బయోపిక్లో నూ న‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే ద‌క్షిణాదిన  గ్లామ‌ర్ పాత్ర‌ ల‌కు..ఐటం పాట‌ల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకుందిట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ తెలుగు, త‌మిళ్ లో క‌లిపి ఏడు సినిమాల్ని రిజెక్ట్ చేసింద‌ని వార్త‌లొస్తున్నాయి.

Tamannaah reported shift from South films :

Tamannaah Bhatia reported shift from South films to Bollywood

Tags:   TAMANNAAH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ