వరస సినిమాలు డిజప్పాయింట్ చెయ్యడంతో మాస్ మహారాజ్ రవితేజ్ మార్కెట్ పడిపోయింది. ఆయన సినిమాలు చేస్తున్నారు, బ్యాక్ టు బ్యాట్ టు ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు తప్ప అందులో ప్రత్యేకత కనిపించడమే లేదు. గత ఏడాది రవితేజ నటించిన మాస్ జాతర పై ఎన్నో హోప్స్ పెట్టుకుంటే అది కూడా నిరాశపరిచింది.
ఎలాంటి హడావిడి లేకుండా పక్కా ప్రమోషన్స్ తో ఈ సంక్రాంతికి రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి సూపర్ హిట్ టాక్ రాకపోయినా యావరేజ్ టాక్ రావడంతో చాలా రోజులకు రవితేజ కు సక్సెస్ దక్కింది అన్నారు.
కానీ మన శంకర వరప్రసాద్ గారు, అనగనగ ఒకరాజు, నారి నారి నడుమ మురారి హిట్ అవడం రవితేజ సినిమా డల్ అవడానికి కారణమైంది. ఫస్ట్ హాఫ్ బావున్నా సెకండ్ హాఫ్ వీక్ అవడం, సంక్రాంతి సినిమాల జోరులో భర్త మహాశయులకు విజ్ఞప్తి నిర్మాతలకు 8 నుంచి 10 కోట్లు లాస్ వస్తుంది అని అంచనా వేస్తున్నారు.




రౌడీ ఫ్యాన్స్ ఆకలి తీర్చేస్తుంది VD 14 
Loading..