చిన్నా లేదు పెద్దా లేదు ఎవరు చూసినా చేతిలో స్మార్ట్ ఫోన్. ఆ ఫోన్ లో సోషల్ మీడియా, యూట్యూబ్ అంటూ హంగామా చేస్తున్నారు. పట్నం లేదు పల్లెటూరు లేదు ఎవ్వరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ లే. పోనీ వాటిని మంచికి ఉపయోగిస్తున్నారా అంటే దానిలో మంచి కన్నా ఎక్కువగా చేడు కే స్మార్ట్ ఫోన్ ఉపయోగపడుతుంది. అది స్మార్ట్ ఫోన్ తప్పు కాదు సోషల్ మీడియా తప్పు,
ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ తీసుకోవడం షేర్ చెయ్యడం, ఇక చిన్న పిల్లలైతే చేతిలో ఫోన్ లేకపోతే ముద్ద దిగదు. చిన్న వయసు నుంచే సోషల్ మీడియాలో అస్లీల వీడియోస్ చూడడం నేరాలకు పాల్పడడం. అందుకే ఏపీ ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం రీసెంట్ గా అమలులోకి తెచ్చిన సోషల్ మీడియా నిబంధనలను ఆంధ్ర ప్రభుత్వం అనుసరించబోతుంది. చిన్న వయస్సులో పిల్లలకు ఇంటర్నెట్ లో దొరికే మంచి, చెడులను నిర్ణయించే తెలివి, పరిణతి ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.
సోషల్ మీడియాలో వాళ్ళ మానసిక ఎదుగుదల కానివ్వండి, లేదంటే శారీరక ఎదుగుదల విషయాల్లో వస్తున్న మార్పుల వలన చిన్నారులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఫోన్, సోషల్ మీడియా వలన చదువుల మీద మాత్రమే కాకుండా, వ్యక్తిత్వ వికాసం మీద కూడా ప్రతికూల ప్రభావం చూపుతోందని మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో అమలులో ఉన్న నిబంధనలను రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టేలా సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు.
నిజంగా ఇది గనక వర్కౌట్ అయితే నారా లోకేష్ ఐడియా ను మెచ్చుకోవలసిందే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.




అనిల్ రావిపూడి నెక్స్ట్ టైటిల్ రెడీ 

Loading..