కెరీర్ ఆరంభం నుంచి అంటే ఆయన మొదటి చిత్రం పటాస్ నుంచి మన శంకరవర ప్రసాద్ గారు వరకు అలుపెరగని పోరాటంలో అన్నీ విజయాలే అందుకుంటూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారిన అనిల్ రావిపూడి ప్రస్తుతం శంకర వరప్రాసాద్ సక్సెస్ టూర్ లో ఉన్నారు. సెలెబ్రేషన్స్ ముగియకముందే అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫుల్ గా క్లారిటీ ఇచ్చేసాడు ఆయన.
తనకు శంకర వరప్రసాద్ గారు వైజాగ్ టూర్లో ఒక ఆలోచన వచ్చింది. ఈసారి టైటిల్ ప్రకటన నుంచే ఒక విచిత్రమైన జర్నీ స్టార్ట్ కాబోతోంది. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ చాలా విచిత్రంగా ఉండబోతుంది. ఇది చూసి చాలామంది వామ్మో, ఇదేంట్రా బాబూ అనుకుంటారు. కానీ కొందరు హమ్మయ్య, ఇంకో సినిమాతో వస్తున్నాడు అనుకుంటారు.
నా నెక్స్ట్ ప్రాజెక్ట్ తో కచ్చితంగా ఒక మ్యాజిక్ అయితే జరగబోతోంది. త్వరలోనే ఆ టైటిల్ ప్రకటిస్తాను. చిరు తర్వాత హీరో ఎవరు అని ప్లాన్ చేసుకోలేదు, నాకు నటుల డేట్స్ ముఖ్యం. ఎవరి డేట్స్ ఖాళీగా ఉంటాయో చూసుకోవడం ముఖ్యం. పవన్ కళ్యాణ్ తో సినిమా చెయ్యాలనుకున్నా ప్రస్తుతం ఆయన్ని కలవలేదు అంటూ అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ పై స్పష్టత నిచ్చేసారు.




ఎన్టీఆర్ యాడ్స్ పై అభిమానుల అలక 

Loading..