అవును యువ హీరో శర్వానంద్ స్పీడు పెంచాడు. కొన్నేళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న శర్వానంద్ ఈ ఏడాది ఆరంభంలోనే నారి నారి నడుమ మురారి తో బిగ్ హిట్ చూసాడు. రీసెంట్ గా సంక్రాంతి సీజన్ లో వచ్చిన ఈచిత్రాన్ని ఆడియన్స్ సూపర్ గా ఆదరిస్తున్నారు. ఇదే స్పీడులో శర్వా మరో మూడు సినిమాలను రెడీ చేస్తున్నాడు.
ఇప్పటికే శర్వానంద్ బైకర్ విడుదలకు సిద్ధం ఉంది. దాని రిలీజ్ డేట్ లాక్ చెసే యోచనలో మేకర్స్ ఉన్నారు. మరోపక్క శర్వానంద్ సంపత్ నంది డైరెక్షన్‌లో చేస్తున్న భోగి చిత్రాన్ని కూడా ఈ ఏడాదే విడుదల చేసే ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది భోగి చిత్రం.
దివాళి స్పెషల్ గా భోగి ని తెచ్చే ఆలోచనలో శర్వా అండ్ టీమ్ ఉంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ అనౌన్స్ చేసిన మూవీ ని 2027 రిలీజ్ సంక్రాంతి అంటూ శర్వానంద్ ఎప్పుడో ప్రకటించాడు. 2026 సంక్రాంతి నుంచి 2027 సంక్రాంతి వరకు శర్వానంద్ ఏకంగా నాలుగు సినిమాల్తో సందడి చెయ్యబోతున్నాడన్నమాట.





పాదయాత్ర పై జగన్ ప్రకటన 
Loading..