2019 ఎన్నికల్లో గెలుపుకు కారణమైన జగన్ పాదయాత్ర 2024 ఎన్నికలకు వాడలేదు. పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి గెలిచి సీఎం పీఠం ఎక్కిన తర్వాత ఆ ప్రజలనే కలవలేదు. అందుకే 2024 ఎన్నికల్లో జగన్ కి బుద్ధిచెప్పి కేవలం 11 సీట్లకు పరిమితం చేసారు. అసలు ఎందుకు ఓడిపోయామో కూడా జగన్ రివ్యూ వేసుకోలేదు.
మేము చేసిన మంచి పనులు చెప్పుకోలేదు అందుకే ఓడిపోయామనే భావనలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్ఛాక తాడేపల్లి టు బెంగుళూరు ప్యాలెస్ ల చుట్టూ చక్కర్లు కొట్టడం, వైసీపీ నేతలెవరైనా జైలుకు వెళితే పరామర్శించడం, లేదంటేప్రెస్ మీట్ పెట్టడం తప్ప ప్రజల్లోకి వెళ్ళింది లేదు. ఆ విషయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, బ్లూ మీడియా కూడా గుర్రుగానే ఉంది.
అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచాక ప్రెస్ మీట్స్ తో గడుపుతున్న జగన్ మోహన్ రెడ్డి మళ్లీ పాదయాత్ర చెయ్యాలి, అప్పుడే వైసీపీ పై ప్రజల్లో నమ్మకం వస్తుంది అని వైసీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. తాజాగా జగన్ ఆ విషయంలో అధికారిక ప్రకటన చేసాడు. తాడేపల్లి వైసీపీ ఆఫీస్ లో జగన్ మట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ళ సమయమే ఉంది. ఆతర్వాత వచ్చేది మన ప్రభుత్వమే.
ప్రజల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది, ఈ సందర్భంగా జగన్ వచ్చే ఏడాదిలో అంటే ఓ ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించాడు. మరి జగన్ మళ్లీ పాదయాత్రతోనే ప్రజల్లోకి వెళ్లి వాళ్ళను కూల్ చేసి అధికారంలోకి వచ్చే ప్రయత్నాల్లో కనిపిస్తున్నారు. కాకపోతే ఈఏడాది కూడా జగన్ ప్రజల్లోకి వెళ్ళరన్నమాట.





మెటా వైస్ ప్రెసిడెంట్ కెల్విన్ మార్టిన్ తో లోకేష్ భేటీ
Loading..