మలయాళ సినిమాలు స్లో పాయిజన్ లా ఇతర భాషల ఓటీటీ ఆడియన్స్ కి ఎక్కేస్తున్నాయి. మలయాళ థియేటర్స్ లో ఏదైనా సినిమా హిట్ అయ్యింది అంటే చాలు ఆ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా, అందులోను తెలుగులోకి అందుబాటులోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు తెలుగు ఆడియన్స్. సస్పెన్స్ థ్రిల్లర్స్, హర్రర్ థ్రిల్లర్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ని ఓటీటీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ కోవలోనే మమ్ముట్టి, వినాయకన్ ప్రధాన పాత్రల్లో మలయాళంలో తెరకెక్కిన కలంకావల్ చిత్రం సోని లివ్ ఓటీటీ నుంచి తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
సోషల్ మీడియాలో కలంకావల్ టాక్ చూసిన వారు ఎప్పుడెప్పుడు దీనిని వీక్షిద్దామా అని వెయిట్ చేసారు. అందులోను మమ్ముట్టి విలన్, వినాయకన్ హీరో టైప్. అందుకే ఆడియన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ కనిపించింది. విలన్ హీరోగా, హీరో విలన్ గా కనిపించడమే కారణం కాబట్టి.
ఇక కలంకావల్ మొదలవడమే మమ్ముట్టి అమ్మాయిల తో సరసమాడుతూ చంపేస్తుంటాడు. అది కూడా విడోస్, పెళ్లి కావాల్సిన అమ్మాయిలను ఎంచుకుని వారితో శృంగారం చేసి వారిని కడతేర్చుతాడు. అలా చంపడంలో ఉన్న హాయి వేరు అంటాడు, మమ్ముట్టి ని పట్టుకోవడానికి స్పెషల్ ఆఫీసర్ గా వినాయకన్ రంగంలోకి దిగుతాడు.
పెద్దగా ట్విస్ట్ లు ఉండవు, మమ్ముట్టి అమ్మాయిలను ఎందుకు చంపుతాడో ముందే చెప్పెయ్యడం, వినాయకన్ ఇన్విస్టిగేషన్ మరీ చప్పగా సాగుతుంది. కానీ కలంకావల్ క్లైమాక్స్ మాత్రం డిఫరెంట్ గా కాకపోయినా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసారు దర్శకుడు. మమ్ముట్టి విలన్ పాత్ర క్రేజీగా ఉంటుంది. లుక్స్ వైజ్ గా భయపెడతాడు, వినాయకన్ పోలీస్ పాత్రలో సినిమా చివరి వరకు సీరియస్ గానే మైంటైన్ చేసాడు. వీరి పాత్రలు తప్ప మిగతా పాత్రలేవి అంతగా కనెక్ట్ అవ్వ్వవు.
కలంకావల్ కి మమ్ముట్టి పాత్ర ప్లస్ అవుతుంది, అలాగే క్లైమాక్స్, BGM ఆకట్టుకుంటాయి. కానీ ట్విస్ట్ లు లేకుండా నెమ్మదిగా సాగె కథనం చిరాకు పెడుతుంది. అసలు ట్విస్ట్ ఫస్ట్ లోనే రివీల్ అవడం తో చివరి వరకు ఆసక్తిలేకుండానే కథ నడుస్తుంది. మమ్ముట్టి పోలీస్ ఎలా అయ్యాడో, అంతగా హత్యలు చేసి హాయిని ఎందుకు పొందాడో అనేది స్పష్టత ఉండదు. సోషల్ మీడియాలో కలంకావల్ కి కనిపించిన స్పందన సినిమా చూసాక ఉండదు. మమ్ముట్టి విలనిజం కోసమైతే కలంకావల్ ఒకసారి వీక్షించవచ్చు.





హిట్ సినిమా ని మిస్ చేసుకున్న శ్రీలీల
Loading..