వరస ప్లాప్ లతో సతమతమవుతున్న శ్రీలీల గత ఏడాది మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది. అందులో ఒకటి కింగ్ డమ్. ఆ చిత్రం విడుదలయ్యాక అందులోనుంచి ఆమె తప్పుకోవడమే బెటర్ అనిపించింది. ఆతర్వాత అఖిల్ లెనిన్ లోను శ్రీలీల ను హీరోయిన్ గా అనౌన్స్ చెయ్యడమే కాదు ఆమె ఫస్ట్ లుక్ వదిలారు. ఆ చిత్రం నుంచి శ్రీలీల తప్పుకుంది.
ఆతర్వాత మూడో సినిమా అనగనగా ఒక రాజుని వదులుకుంది. నవీన్ పోలిశెట్టి తో శ్రీలీల నటిస్తుంది అంటూ మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ రివీల్ చేసారు. తీరా శ్రీలీల ప్లేస్ లో మీనాక్షి చౌదరి వచ్చింది. ఈ సంక్రాంతికి విడుదలైన నవీన్ పోలిశెట్టి అనగనగ ఒకరాజు చిత్రం అదిరిపోయే కామెడీ హిట్ గా నిలిచింది. గత బుధవారం విడుదలైన ఈ చిత్రం అఫీషియల్ గా రూ.100 కోట్ల క్లబ్బులోకి చేరింది.
మరి శ్రీలీలను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారో, తప్పకుందో తెలియదు కానీ ఆ అదృష్టం మీనాక్షి ని వరించింది. ఇప్పుడు సినిమా హిట్ అయ్యింది. ఆ హిట్ శ్రీలీలకు కాదు మీనాక్షి చౌదరి ఖాతాలో చేరింది. మరి ప్లాప్స్ తో సతమతమవుతున్న శ్రీలీల కు ఈ అనగనగా ఒకరాజు హిట్ ఖాతాలో పడితే శ్రీలీల కెరీర్ కుదురుకునేది. ఇప్పుడు ఆ ఛాన్స్ చేజేతులా శ్రీలీల మిస్ చేసుకుంది అదే ఆమె ఫ్యాన్స్ బాధ.





కాజల్ ఫిట్ నెస్ చూస్తే షాకవ్వాలి
Loading..