గత ఏడాది సంక్రాంతి కి అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఫైనల్ రన్ లో రూ.300 కోట్ల క్లబ్బులోకి చేరితే.. ఈ ఏడాది సంక్రాంతి కి అదే అనిల్ రావిపూడి సినిమా మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ వీక్ గడిచేసరికి రూ.300 కోట్ల క్లబ్బులోకి ఎంటర్ అవుతుంది. ఇప్పటికే ఆల్ ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ అయ్యింది మన శంకర వరప్రసాద్ గారు.
గత సోమవారం విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వేసి ప్రకటించారు. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.292 కోట్లు అంటూ పోస్టర్ వేసి మరీ ప్రకటించారు. అంటే రూ.300 కోట్లకి ఒక్క అడుగు దూరంలో మన శంకర వరప్రసాద్ గారు ఉన్నారు.
మరి ఈ ఫిగర్ ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో, ఈరోజు సోమవారం వర్కింగ్ డే మన శంకర వరప్రసాద్ గారు పెరఫార్మెన్సు ఎలా ఉంటుందో అనేది ఈరోజు కలెక్షన్స్ బట్టి తేలుతుంది.





ఈరోజు అసలు కథ మొదలవుతుంది
Loading..