Advertisementt

ఈరోజు అసలు కథ మొదలవుతుంది

Mon 19th Jan 2026 11:18 AM
sankranti  ఈరోజు అసలు కథ మొదలవుతుంది
Litmus Test for Sankranti releases ఈరోజు అసలు కథ మొదలవుతుంది
Advertisement
Ads by CJ

నిన్నటివరకు సంక్రాంతి సెలవల జోష్, సంక్రాంతి సీజన్ లో విడుదలైన సినిమాల్లో ప్రభాస్ రాజసాబ్ తప్ప మిగతా సినిమాలన్ని హిట్ దిశగా దూసుకుపోతున్నాయి. సోమవారం, మంగళవారం, బుధవారం విడుదలైన నాలుగు సినిమాలు సంక్రాంతి సెలవలు కావడంతో హౌస్ ఫుల్ కలెక్షన్స్ మాత్రమే కాదు బ్రేక్ ఈవెన్ అవ్వడంలో ఇప్పటికే మన శంకర వరప్రసాద్ గారు, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒకరాజు ఒకడుగు ముందు ఉన్నాయి.

ఆతర్వాత రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారి నారి నడుమ మురారి లు ఇంకా బ్రేక్ ఈవెన్ కి అడుగు దూరంలో ఉన్నాయి. రాజాసాబ్ ఈ నాలుగు హిట్స్ లో కనిపించకుండా పోయింది. అయితే నిన్నటివరకు హౌస్ ఫుల్ బోర్డ్స్ తో మన శంకర వరప్రసాద్ గారు, భర్తమహాశయులకు విజ్ఞప్తి, అనగనగ ఒకరాజు, నారి నారి నడుమ మురారి లు కళకళలాడాయి. 

మరి ఈరోజు సోమవారం వర్కింగ్ డే నుంచి ఈ నాలుగు సినిమాల అసలు కథ మొదలవుతుంది. అంటే నిన్నటివరకు లాంగ్ వీకెండ్, సంక్రాంతి హాలిడేస్ తో థియేటర్స్ కళకళలాడాయి. మరి ఈరోజు సోమవారం నుంచి స్కూల్స్  ఓపెన్ అవుతున్నాయి. ఆఫీస్ లు మొదలైపోయాయి.

ఇలాంటి సమయంలో థియేటర్స్ కి వెళ్లే జనాలు ఎంతమంది, ఈరోజు నుంచి థియేటర్స్ లో ఆక్యుపెన్సీ కనిపిస్తుందా, ప్రేక్షకుల కిలకిలలు కనిపిస్తాయా, బాక్సాఫీసు గలగలా వినిపిస్థాయా, అసలు ఈరోజు నుంచి ఏ సినిమాకి ప్రేక్షకులు ఓటేస్తారో చూడాలి. 

Litmus Test for Sankranti releases:

Will Sankranti releases pass the litmus test

Tags:   SANKRANTI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ