మన శంకర వరప్రసాద్ గారు సోమవారం విడుదలై ఇంకా సోమవారం రాకముందే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైపోయింది. జనవరి 12 న రెండు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు చిత్రం లాభాల బాట పట్టింది.
లాభాలొస్తున్నాయి కదా అని దర్శకుడు అనిల్ రావిపూడి ఊరుకోవడం లేదు, ఇంకా మన శంకర వరప్రసాద్ గారు ని ప్రమోట్ చేస్తూ థియేట్రికల్ టూర్ స్టార్ట్ చేసాడు. మరి ఇలాంటి దర్శకుడు ఉంటె సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంది. సినిమా స్టార్ట్ చేసిన ఏడు నెలల్లో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చెయ్యడమే కాదు ప్రోపర్ ప్రమోషన్స్ తో సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.
విడుదలయ్యాక హిట్ అయ్యింది కదా అని రిలాక్స్ అవ్వకుండా సక్సెస్ సెలబ్రేషన్స్, సక్సెస్ మీట్స్ అంటూ హడావిడి చేసారు, బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలు స్టార్ట్ అయ్యాయి కదా అని వెకేషన్ కి వెళ్లకుండా ఇంకా ఇంకా సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళుతున్నారు. మరి ఇది కేవలం అనిల్ రావిపూడి కే సాధ్యం అనేలా ఉంది.





రాజసాబ్ అఫీషియల్ ప్లాప్ అంటున్నారు 
Loading..