పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజసాబ్ ఎన్నోసార్లు వాయిదాపడి ఈఏడాది మొదట్లో సంక్రాంతి స్పెషల్ గా జనవరి 9 న భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ రాజసాబ్ కి ప్రీమియర్స్ నుంచే డివైడ్ టాక్ స్టార్ట్ అయ్యింది. దానితో రెండోరోజు కొన్ని సీన్స్ యాడ్ చేసారు దర్శకుడు మారుతి. ఆ సీన్స్ రాజసాబ్ ని సేవ్ చేస్తాయి అనుకునేలోపు మెగాస్టార్ దిగారు.
మన శంకర వరప్రసాద్ ఆతర్వాత భర్తమహాశయులకు, అనగనగ, నారి నారి ఇలా వచ్చిన నాలుగు సినిమాలకు హిట్ టాక్ రావడం రాజాసాబ్ కి మైనస్ అయ్యింది. మేకర్స్ రాజసాబ్ కలెక్షన్స్ పోస్టర్స్ అఫీషియల్ గా వేస్తున్నా.. దానిని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడేమో ఈ ఏడాది మొదటి ప్లాప్ రాజసాబ్ అంటూ మాట్లాడుతున్నారు.
స్వయానా దర్శకుడు మారుతి స్నేహితులే ఈ కామెంట్స్ చేస్తున్నారు అంటే రాజసాబ్ పరిస్థితి ఏమిటో స్పష్టమవుతుంది. మరి రాజసాబ్ 2026 కి మొదటి ప్లాప్ గా నిలిచినట్లేనా, ఈ విషయమై ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అసలే రాజసాబ్ పాప్ అంటే చాలు ఏసుకుపడిపోతున్నారు.





ధనుష్‌తో పెళ్లి - మృణాల్ కౌంటర్
Loading..