Advertisementt

కృతి శెట్టి కి షాకిచ్చిన కీర్తి సురేష్

Sat 17th Jan 2026 08:26 PM
keerthy suresh  కృతి శెట్టి కి షాకిచ్చిన కీర్తి సురేష్
Krithi Shetty కృతి శెట్టి కి షాకిచ్చిన కీర్తి సురేష్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇద్దామని వెయిట్ చేస్తున్న కృతి శెట్టి కి అడుగడుగునా అపశకునాలే అన్నట్టుగా కార్తీ తో నటించిన వా వాతియార్ పోస్ట్ పోన్, పోస్ట్ పోన్ అవుతుంది. దానితో కృతి శెట్టి ఆశలు నీరు గారిపోతున్నాయి. మరో సినిమా ప్రదీప్ రంగనాధన్ LIK కూడా పోస్ట్ పోన్ అవడం కృతి శెట్టి బ్యాడ్ లక్ అని చెప్పాలి.

టాలీవుడ్ లో అవకాశాలు లేవు, తమిళ్ ఉన్న ఛాన్స్ ల్లో బ్యాడ్ లక్ నడుస్తున్న సమయంలో ముంబై లో కనిపించింది కృతి శెట్టి, దానితో ఆమెకు హిందీ అవకాశం వచ్చింది అన్నారు. కాదు నిజంగానే వచ్చింది. హిందీ మూవీ ఆడిషన్ కోసం కృతి శెట్టి ముంబై వెళ్ళింది. ఆడిషన్స్ జరిగాయి. ఇంకేంటి కృతి శెట్టి కి బాలీవుడ్ ఛాన్స్ వచ్చేసింది అనుకున్నారు.

తీరా చూస్తే కృతి శెట్టికి షాకిస్తూ కీర్తి సురేష్ ఆ ప్రోజెక్టు లోకి ఎంటర్ అయినట్లుగా తెలుస్తుంది. బేబి జాన్ తో హిందీలోకి ఎంటర్ అయ్యి ఆ సినిమాతో ప్లాప్ ని మూటగట్టుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు కృతి శెట్టి ఛాన్స్ ని పట్టేసినట్లుగా తెలుస్తుంది. తెలుగులోనూ రేజింగ్ లో కీర్తి సురేష్ కి ఇప్పుడు హిందీ లో మరో అవకాశం రావడం నిజంగా లక్కీ అనే చెప్పాలి. 

Krithi Shetty:

Keerthy Suresh

Tags:   KEERTHY SURESH
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ